విద్యార్థులకు… నాయకులకు “పరీక్షలే”..!

Share

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)


అమరావతి: రాష్ట్రంలో రాజకీయ నాయకులకు ఎన్నికల పరీక్షలు, విద్యార్థులకు ఇంటర్, పదవ తరగతి పరీక్షలు ఒకే సారి వచ్చి పడ్డాయి. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాగా 23వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నెల 4వ తేదీ నుండి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాగా నేటి నుండి ఇంటర్ ద్వీతయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షలు ఈ నెల 23వ తేదీ వరకూ జరగనున్నాయి. అదే రోజు నుండి ఏప్రిల్ ఎనిమిద తేదీ వరకూ పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇదే తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా కూడా మోగనుంది. నేడో రేపో స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 9వ తేదీ నుండి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశం ఉందని మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంకేతాలు ఇచ్చారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని మంత్రులకు సిఎం వెల్లడించారు. ఈ నెల 21న ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు, 24న మున్సిపల్ ఎన్నికలు, 27న పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక పక్క ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండగా గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్‌లకు పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీలు కూడా వేశారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఈ నెల 10,11వ తేదీల నుండి ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో లౌడ్ స్పీకర్‌లతో అభ్యర్థుల ప్రచార పర్వం నిర్వహిస్తే పరీక్షలు రాసే ఇంటర్ విద్యార్థులకు, పదవ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క పరీక్షలు, మరో పక్క ఎన్నికల ప్రచారం జరగడం వల్ల విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
పోలీస్ శాఖ ఇటు పరీక్షలకు అటు ఎన్నికలకు బందోబస్తు విధులకు కానిస్టేబుళ్లను నియమించడంతో పాటు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బందోబస్తు చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాలకు ప్రశ్నా పత్రాల పంపిణీ సమయంలో, పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తుకు పోలీసు సిబ్బంది వినియోగించడంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుకు సిబ్బందిని వినియోగించాలి. మరో పక్క ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు జరగకుండా శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది.
సాధారణంగా ఎన్నికల విధులకు ఉపాధ్యాయులు, అధ్యాపకులను వినియోగిస్తుంటారు. పరీక్షల సీజన్ ప్రారంభం కావడంతో ఇన్విజిలేషన్ డ్యూటీలు లేని ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఎన్నికల విధులను అప్పగిస్తారు. అయితే ఇప్పటికే గుర్తించిన పలు పోలింగ్ కేంద్రాలను మార్పు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. గ్రామాల్లో, పట్టణాల్లో హైస్కూళ్లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటారు. 23వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను ఎలిమెంటరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు మార్పు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఒక పక్క పరీక్షలు, మరో పక్క ఎన్నికలు జరగడం ఇదే ప్రధమం కావచ్చేమో.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

31 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago