33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతున్న నేతల ఆడియో లీక్ ల వ్యవహారం.. మొన్న కేటీఆర్ .. నేడు ఎంపి వెంకటరెడ్డి ఆడియా.. రేపు ఎవరిదో..?

Share

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల ఆడియోల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఆడియో లీక్ ల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రీసెంట్ గా టీఆర్ఎస్ నేత, మంత్రి కేటిఆర్ ఓ బీజేపీ నాయకుడుతో మాట్లాడినట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ప్రత్యర్ధి పార్టీ నేతలకు ఫోన్లు చేసి మాట్లాడుతున్న విషయాలు లీక్ కావడంతో నేతలు చాలా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో వైరల్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ గా ఉన్నప్పటికీ ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపున అభ్యర్ధిగా ఉండటం, రాష్ట్ర పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉండటంతో ఆయన మునుగోడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. రీసెంట్ గా మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డికి ఆయనను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా ఆమె కోరారు. అయినప్పటికీ ఆయన దూరంగా ఉన్నారు.

MP Komatireddy Audio Leak

 

ఈ తరుణంలో మునుగోడులో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలంటూ ఎంపీ కోమటిరెడ్డి ఫోన్ లో సంభాషించడం హాట్ టాపిక్ అయ్యింది. ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. “ఈ దెబ్బతో పీసీసీ ప్రెసిడెంట్ నేను అవుతా” అంటూ కాంగ్రెస్ ఎంపీ ఫోన్ కాల్ లో సంభాషణ వినిపించింది. “రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా.. అధికారంలోకి తీసుకొస్తా.. పార్టీలను చూడొద్దు.. రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలి. ఎదైనా ఉంటే నేను చూసుకుంటా. చచ్చినా బతికినా రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటాడు. రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలి” అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

అయితే దీనిపై ఆయన ఏమీ స్పందించలేదు. పీసీసీ అధ్యక్షుడుగా తనను తప్పించాలని కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలా ఒకరి తర్వాత మరొక నేతల ఆడియోలు వైరల్ అవుతుండటంతో నేతలు అప్రమత్తమవుతున్నారు. ఈ మునుగోడు ఎన్నికల లోపు ఇంకా ఎంత మంది నాయకుల ఆడియోలు ఇలా వైరల్ అవుతాయి, తర్వాత ఏ నాయకుడి ఆడియో బయటకు వస్తుందో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.


Share

Related posts

Breaking: రేపు నిరుద్యోగ దీక్ష విషయంలో వైయస్ షర్మిల కి సడన్ షాక్..!!

P Sekhar

State: బ్రేకింగ్ః దేశంలో మూడు కొత్త రాష్ట్రాలు… ఎక్క‌డంటే…

sridhar

Bigg Boss 5 Telugu: ఈవారం అలా చేయకపోతే హోస్ట్ గా నాగార్జున(Nagarjuna) వేస్ట్ అంటున్న జనాలు..!!

sekhar