NewsOrbit
Featured రాజ‌కీయాలు

స్థానిక సమరం నిమ్మగడ్డ × జగన్ మళ్ళీ మొదలు..!!

CM Jagan VS Nimmagadda ; What Will happen?

ఏపీలో రాజకీయ వేడి రగులుతోంది. అయితే.. ఈ పోరు రెండు రాజకీయ పార్టీల మధ్య కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థకు మధ్య జరగడం విచిత్రం. ఏపీ సీఎం జగన్ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నట్టు సాగుతోంది వ్యవహారం. ఈ నిప్పుల కుంపటికి నిమ్మగడ్డ నిప్పు రాజేస్తున్నారు. మార్చిలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా కారణంగా చూపిస్తూ వాయిదా వేశారు నిమ్మగడ్డ. ఇప్పుడు ఆయనే ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నారు. అయితే.. ఇక్కడ ఎస్ఈసీ ముందుకెళ్తున్న తీరు రాజకీయ పార్టీలకు సముచితంగానే ఉన్నా.. ప్రజలు విశ్వసిస్తారా..అనేది ప్రశ్న.

local body election heat between cm jagan and sec nimmagadda Ramesh kumar
local body election heat between cm jagan and sec nimmagadda Ramesh kumar

 

ఎస్ఈసీరాజకీయపార్టీల మాట ఇదీ..

ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డను ఆ పదవి నుంచి తొలగించడం, ఆయన కోర్టుకు వెళ్లి తన పదవిని తిరిగి పొందడం తెలిసిందే. ఆ హోదాలో ఎస్ఈసీ ఎన్నికలు జరపాలంటున్నారు. ఇందుకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. దీనిపై ప్రభుత్వం హైకోర్టులో ఎన్నికల కమిషన్ పై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మీటింగ్ ను నిలువరించాలని. అయినా.. సమావేశం జరిగింది. అందరూ ఎన్నికల కమిషనర్ మాటగానే ఎన్నికలు నిర్వహించాలనే అంటున్నారు. అయితే ప్రభుత్వం ఘాటుగానే స్పందిస్తోంది. ‘ప్రభుత్వ నిర్ణయం తెలుసుకోకుండా గతంలో ఎన్నికలు రద్దు చేసిననప్పుడు రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వ నిర్ణయాన్ని తీసుకోకుండా ఎన్నికలు ఎస్ఈసీ ఎలా రద్దు చేశారు?’ అని ప్రశ్నిస్తోంది.

ప్రభుత్వం ప్రశ్నలకు సమాధానమేది..

‘ప్రభుత్వంపై కోర్టులకు వెళ్లి, హోటళ్లలో టీడీపీ నేతలను కలుస్తున్న అధికారిని మేము విశ్వసించలేం. పదుల సంఖ్యలో కరోనా కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసి.. ప్రస్తతం వేలల్లో కేసులు ఉన్నప్పుడు ఎలా ఎన్నికలు నిర్వహిస్తామంటారు? ఇందులో రాజకీయ కోణం ఉందనే అనుమానం వస్తోంది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా పార్టీల అభిప్రాయం తీసుకోవడమేంటి’ అంటూ వాదిస్తోంది. ఈ విషయంలో ఎస్ఈసీ-పార్టీల అభిప్రాయం కంటే ప్రజాభిప్రాయం ముఖ్యం. గడచిన కాలంలో జరిగిన తీరు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీల రాజకీయ కోణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న ప్రజలు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలొచ్చినా తీర్పునిచ్చేందుకు సిద్ధం. మరి ఎవరి మాట గెలుస్తుందో చూడాలి.

author avatar
Muraliak

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?