NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

Local Elections ; పరిషత్ ఎన్నికలు కూడా ఈ నెలలోనే..! నేడో, రేపో ప్రకటన..!?

Local Elections ; Parishath elections Notifications ?

Local Elections ; పంచాయతీలు ముగిసాయి. పురపాలికలు ముగిసాయి. ఇంకా మిగిలి ఉన్నదీ పరిషత్ ఎన్నికలు మాత్రమే. ఇవి కూడా అయిపోతే ఓ పనైపోతుంది. ఎన్నికలు అనే గోల ఉండదు. అధికారిపై ఒత్తిడి ఉండదు. పోలీసులకు కాస్త స్వాంతన ఉంటుంది. అందుకే పనిలో పనిగా ఈ నెలలోనే ఇవి పెట్టేయాలని ప్రభుత్వం అనుకుంటుంది.. కానీ ఇక్కడ కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. ఈ నెలలో పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా..!? దీనికి అవకాశాలు, అవరోధాలు పరిశీలిస్తే..!!

Local Elections ; Parishath Notification ?
Local Elections Parishath Notification

Local Elections ; నాటి ఏకగ్రీవాలె పెద్ద అడ్డంకి..!

గత ఏడాది ఎక్కడ ఆగాయి అక్కడి నుండి మున్సిపల్ ఎన్నికలను కొనసాగించారు. సో.. ఇబ్బంది లేకుండా సాగిపోయాయి. కానీ పరిషత్ ఎన్నికలను అలా కొనసాగించడానికి లేదు. అలాగే కొనసాగిస్తే అప్పుడు ఏకగ్రీవం అయిన 24 ఎంపీటీసీ స్థానాలను కాకుండా మిగిలిన స్థానాల్లో ఎన్నికలు జరపాలి. కానీ ఆ ఏకగ్రీవాలు అన్నీ వివాదాస్పదం అనీ, అక్రమం అనీ, అన్యాయం అని సాక్షాత్తు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో కోర్టులో అఫడవిట్ వేశారు. అందుకే తానే “అన్యాయం, అక్రమం, తప్పుడు ఏకగ్రీవాలు” అని చెప్పినవి… మళ్ళీ తానే వాటిని రద్దు చేయకుంటే ఇబ్బందులు తప్పవు. పోనీ వాటిని రద్దు చేసేసి, ఫ్రెష్ గా చేయాలని అనుకున్నా ప్రభుత్వం ఊరుకోదు. నాడు ఏకగ్రీవం అయిన 24 శాతం మంది కోర్టులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వివాదం చిన్నది కాదు. ఇది తేలితేనే పరిషత్ ఎన్నికలపై ముందడుగు పడుతుంది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. హైకోర్టు ఎవరికీ అనుకూలంగా/ వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన ఏదో ఒక పక్షం సుప్రీం కోర్టుకి వెళ్లడం ఖాయమే. అక్కడి నుండి తీర్పు రావడం.. ఈ పదిహేను రోజుల్లో ఎన్నికలు మొత్తం జరిపించేయడం కష్టమే..!

Local Elections ; Parishath Notification ?
Local Elections Parishath Notification

కోర్టు తీర్పు రేపు..!? ప్రకటన కూడా..!?

ఈ నేథ్యంలోనే రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. నాడు ఏకగ్రీవాలు అయిన స్థానాలపై మధ్యేమార్గంగా వ్యవహరించి… అంటే కొన్నింటిపై మాత్రమే పిర్యాదులు తీసుకుని, విచారణ చేసి.. మిగిలినవి అలాగే కొనసాగిస్తే ఇరు పక్షాలకు ఇబ్బంది ఉండదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆ నిర్ణయం తీసుకుని… మరీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చిన స్థానాలపై విచారణ చేసి.. మిగిలిన చోట పోలింగ్ పెట్టేస్తే బాగుంటుంది అని కొందరు సూచిస్తున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ ఆలోచనకి సిద్ధంగానే ఉంది. అందుకే ఈ నెల 18 నుండి జరగాల్సిన శాసనసభ సమావేశాలను వాయిదా వేసినట్టు తెలుస్తుంది. రేపు లేదా ఎల్లుండి నోటిఫికేషన్ విడుదల చేసి.., ఈ నెల 24 లేదా 25 తేదీల్లో పరిషత్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారని ప్రచారం జరుగుతుంది..! ఇది జరగాలంటే ముందు ఈరోజు లేదా రేపు కోర్టు నుండి తుది తీర్పు రావాల్సి ఉంది..!!

author avatar
Srinivas Manem

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju