లోకేశ్ వరద ప్రాంత పర్యటన లపై సెటైర్లు..!!

తాజాగా కొత్తగా తెలుగుదేశం పార్టీ కమిటీ పదవులలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కించుకున్నాడు నారా లోకేష్. ఇదిలా ఉండగా 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన లోకేష్…చాలావరకు సోషల్ మీడియా కి పరిమితమయి యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కరోనా వైరస్ రావటంతో మొన్నటి వరకు హైదరాబాదులోని సొంత నివాసంలో ఉంటూ అడపాదడపా రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవల ఏపీలో కుండపోత వర్షాల కారణంగా చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. కృష్ణ, గోదావరి నదులకు వరదలు రావడంతో.. ముంపు బాధితులు పరామర్శించడానికి నారా లోకేష్ చేపట్టిన పర్యటన పై సోషల్ మీడియా లో సెటైర్లు పడుతున్నాయి.

వరద ముంపు ప్రాంతాల్లో లోకేష్ పర్యటన: వ్యవసాయమంత్రి ఎక్కడున్నారంటూ ఫైర్ |  Nara lokesh visited flood affected areas in east godavari - Telugu Oneindiaతాజాగా తూర్పుగోదావరి జిల్లాలో లోకేష్ పర్యటించడం జరిగింది. సాధారణంగా నీటి ముంపు ప్రాంతాలలో పొలాలను పరిశీలించి రైతుల బాధలను తెలుసుకుంటారు రాజకీయ నేతలు. అయితే లోకేష్ పర్యటన దానికి భిన్నంగ జరుగుతుందట. బాధలో ఉన్న వారిని పరామర్శించేందుకు లోకేష్ పర్యటన లో టిడిపి క్యాడర్ పెద్ద పెద్ద పార్టీ జెండాలు పట్టుకుని జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ అనే నినాదాలు చేసుకుంటూ బాధితుల దగ్గర హడావిడి చేస్తున్నారట. దీంతో ఈ ర్యాలీలో హడావిడి చూస్తున్న ప్రజలు ఇది పరామర్శల పర్యటన లాగా లేదు విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది అనే కామెంట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

మరోపక్క నీట ముప్పు ప్రాంతాలలో ఉన్న బాధితులు లోకేష్ కి తమ గోడును కూడా చెప్పుకోలేని పరిస్థితి… టిడిపి క్యాడర్ చేస్తున్నట్లు విమర్శ వస్తుంది. దీంతో రాక రాక జనాల మధ్య లోకి వస్తున్న నారా లోకేష్ కి సొంత పార్టీ కార్యకర్తలు క్యాడర్ చేస్తున్న అత్యుత్సాహం… కాస్త ఇబ్బంది పాలు చేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్ వస్తోంది.