NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బుర‌ద‌లో ప‌డే ట్రాక్ట‌ర్‌ను నిల‌బెట్టిన‌ట్లే… అమ‌రావ‌తిని లోకేష్ నిల‌బెడ‌తారు

తెలుగుదేశం పార్టీ కొన్ని సంద‌ర్భాల్లో వ్య‌వ‌హ‌రించే తీరు, తీసుకునే నిర్ణ‌యాలు, చేసే కామెంట్లు ఆ పార్టీ నేత‌ల‌కు ఎలా ఉంటాయో తెలియ‌దు కానీ రాజ‌కీయ విశ్లేష‌కుల‌కు మాత్రం న‌వ్వు తెప్పించే విధంగా ఉందంటున్నారు.

 

తాజాగా, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న గురించి, రాష్ట్రంలోని వివిధ సంఘ‌ట‌ల‌ను ఉద‌హ‌రిస్తూ విలేక‌రుల స‌మావేశంలో ఆ పార్టీ నేత‌లు చేసిన కామెంట్ల‌ను గురించి ప్ర‌స్తావిస్తూ టీడీపీ నేత‌లు చేసిన డిమాండ్ ఇదే భావ‌న‌ను క‌లిగిస్తోంది.

అమ‌రావ‌తి గురించి ఏమ‌న్నారంటే….

టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక గొప్ప నగరాలకు ధీటుగా గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని తలపెట్టిందని దివ్య‌వాణి తెలిపారు. “చంద్రన్న పాలనలో ఆకాశాన్నంటే భవనాలు అక్కడ భూమిని చీల్చుకొని మొలిచాయి. సీడ్ యాక్సెస్ రోడ్లు రాజధానికి మణిహారాల్లా నిలిచాయి. అటువంటి నగరం ప్రభుత్వం మారగానే మౌనంగా రోదిస్తోంది. మూడు రాజధానుల నిర్ణయంతో భావితరాల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. పాలకుల నిర్ణయానికి వ్యతిరేకంగా, రాయపూడి రోడ్డెక్కితే, తుళ్లూరు తుళ్లిపడింది. బోరుపాలెం బోరున విలపిస్తుంటే, అనంతవరం ఆగ్రహిస్తే, ఉద్ధండరాయుని పాలెం ఉడుకెత్తుతోంది. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాలను రోడ్డెక్కించేలా మూడు రాజధానులనే నిర్ణయం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నారు“అని ఆరోపించారు.

లోకేష్ స‌త్తా ఏంటో తెలుసా?

ప్రజల ఓటు విలువ తెలియాలంటే, ముఖ్యమంత్రి తక్షణమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ నేత డిమాండ్ చేశారు. “పెట్రోల్ డీజిల్ పై రూ.500కోట్ల భారం వేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో రూ.1000కోట్లవరకు ప్రజలనుంచి వసూలుచేస్తున్నారు. రాష్ట్రానికి ఎన్నిసమస్యలున్నా, చంద్రబాబు ఏనాడూ ప్రజలపై వీసమెత్తు భారం వేయలేదు. వరద బురదలో పడిపోయే ట్రాక్ట‌రుని ఆపిన సత్తా ఉన్న నాయకుడు లోకేశ్, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం పడుకోబెట్టిన రాజధానిని తిరిగి ప్రపంచం మెచ్చేలా నిలుచోబెట్టే సమర్థుడు కూడా ఆయనే. శిరోముండనం బాధితుడి మాదిరే, అమరావతి రైతులు తాము కూడా నక్సలైట్లలో చేరతామని రాష్ట్రపతికి లేఖలు రాస్తే, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని పాలకులు గ్రహిస్తే మంచిది.“ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

author avatar
sridhar

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N