ఆఫీసుకు పారికర్

పనాజీ, జనవరి 1 : అనారోగ్యం నుంచి కోలుకుంటున్న గోవా సీఎం మనోహర్ పారికర్ నాలుగు నెలల విరామం తర్వాత సోమవారం సచివాలయానికి హాజరయ్యారు. రాష్ర్ట మంత్రులు, అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. సిఎం చివరిగా 2018 ఆగస్టులో సెక్రటేరియట్వచ్చారు.
పాన్క్రియాటిక్ సమస్యతో బాధపడుతున్న సిఎం ముంబాయి, అమెరికా, ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స తీసుకున్నారు. ఎయిమ్స్నుండి వచ్చిన తర్వాత గత ఏడాది అక్టోబర్లో మీడియా ముందుకు వచ్చారు. పనాజీలో వంతెన నిర్మాణ పనుల పరిశీలనకు ముక్కుకు ట్యూబ్తో సీఎం ఉన్న ఫొటో బిజెపి విడుదల చేయడంతో కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
తన ఛాంబర్లో ముక్కుకు ట్యూబ్తోనే సీఎం పారికర్ కనిపించారు.