Mansas Trust: ప్రభుత్వం ఎందుకో తప్పటడుగు వేస్తుంది..! మన్సాస్ పై మరకలేల..!? ఇలా చేయొచ్చుగా..!?

Ashok Gajapathi Raju: Will be Arrest soon.. but
Share

Mansas Trust: రాజకీయంలో పాలన పక్షం వేరు, ప్రతిపక్షం వేరు.. “ప్రతిపక్షాలు అంటేనే అల్లరి చేస్తాయి, కుట్రలు చేస్తాయి, ప్రతీదాన్ని రాజకీయం చేస్తాయి, రాష్ట్రాన్ని వెనక్కు నెట్టేలా చేస్తాయి, అధికార పక్షాన్ని రెచ్చగొడతాయి.. అంపాపురం పంచాయతీలో అయినా అంతే.., అమలాపురం మున్సిపాలిటీలో అయినా అంతే.., అమెరికాలోని పార్లమెంట్ హౌస్ లో అయినా అంతే.. ఆంధ్రా కూడా ఏమి ప్రత్యామ్నాయం కాదు..! కానీ ఎందుకో ఏపీలో ప్రతిపక్షంతో పాటూ అధికార పక్షం కూడా అల్లరి చేస్తుంది. కొన్నిటిలో కుట్రలు చేస్తుంది. కొన్ని చోట్ల రాజకీయం చేస్తుంది. చాలా విషయాల్లో సహనం కోల్పోతుంది.. అధికార పక్షానికి బాధ్యత, నెత్తిపై కిరీటం ఉంటుంది. దాన్ని సవరించుకుంటూ, జాగ్రత్తగా మోయాలి. అధికార పక్షంలో ఎవరైనా నోరు జారితే అదుపులో పెట్టేయాలి. కానీ ఏపీలో అది జరగడం లేదు. నాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు వైసిపి అధికారంలోకి వచ్చాక అంతే..! తాజా ఉదాహరణ మన్సాస్ ట్రస్ట్ వ్యవహారమే.. కోర్టు మొట్టికాయ వేసి, మన్సాస్ విషయంలో ప్రభుత్వాన్ని తప్పు పట్టినప్పటికీ విజయసాయిరెడ్డి లాంటి సీనియర్ ఎంపీ, దేవాదాయశాఖ మంత్రి స్థానంలో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ హద్దు మీరి, అనవసరం మాటలు మాట్లాడుతున్నారు.

Must Read it: మన్సాస్ ట్రస్ట్ వివాదం ఎక్కడ మొదలయింది..!? చరిత్ర ఏమిటి..!? సవాళ్లు ఏమిటి..!?

Mansas Trust: Mistakes by Both Sides
Mansas Trust: Mistakes by Both Sides

Mansas Trust: సెంటిమెంట్ తో కూడిన అంశంతో ఆటలు..!!

మన్సాస్ ట్రస్ట్ టీడీపీ పార్టీది కాదు.. టీడీపీ పార్టీ పెట్టలేదు. రాజకీయానికి సంబంధం లేదు. అది ఒక మహారాజాది. పేరున్న రాజవంశీయులది. దశాబ్దాల చరిత్ర ఉన్నదీ. మూడు జిల్లాల్లో లక్షలాది జనాల మనోభావాలతో లింకు ఉన్నదీ. ఆ విషయం గ్రహించకుండా రాజకీయంగా వివాదాలోకి లాగి వైసిపి ప్రభుత్వం మొదటి ఆట మొదలు పెట్టింది. ఎక్కడో ఉన్న సంచయితని తీసుకొచ్చి.. ఆమెని బొమ్మగా పెట్టి విజయసాయి లాంటివారు తలదూర్చి రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే దీనిలో సెంటిమెంట్ రగిలింది. కోర్టుకు కూడా అంశాలు తెలుసు. చరిత్ర తెలుసు. అందుకే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఇంహతా జరిగిన తర్వాత కూడా విజయసాయిరెడ్డి పూర్తి విశ్\ద్వేష పూర్వక వ్యాఖ్యలు చేశారు. “అశోక్ గజపతిరాజు ఒక దొంగ … దొడ్డి దారిన మళ్లీ సింహాచలం దేవస్థాన చైర్మన్ అయ్యారు. దీనిపై అప్పీల్‌కి వెళ్తున్నాం.. అశోక్ గజపతి రాజును మళ్లీ అతి త్వరలో చైర్మన్ కుర్చీనుంచి తప్పకుండా దించేస్తాం” అంటూ కోర్టు తీర్పుపై కూడా భిన్నంగా స్పందించారు. దొంగకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇది రెచ్చగొటే వ్యాఖ్య.. అలా కాకుండా… ఇలా మాట్లాడకుండా సింపుల్ గా ప్రభుత్వం మరో మార్గాన్ని ఎంచుకోవాల్సింది..

Mansas Trust: Mistakes by Both Sides
Mansas Trust: Mistakes by Both Sides

విచారణ కమిటీతో ఎన్నో అంశాలు..!!

మన్సాస్ ట్రస్ట్ పై ఆరోపణలున్నాయి. 2016 లో అశోక్ గజపతి రాజు చైర్మన్ అయ్యాక దాదాపు 1000 ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. చుట్టుపక్కల రైతులు వీటిని ఆక్రమించుకుని అనధికార సాగు ప్రారంభించారు. ఇది ఒక ఆరోపణ, పుకారు మాత్రమే.. వీటిని పట్టుకుని అశోక్ గజపతి రాజుని దొంగ అనీ, దించేస్తాం అనీ, నిబంధనలకు విరుద్ధంగా ఒక బొమ్మని పెట్టి మేమె ఏలుతాం అనీ అనుకోవడం, ఆలోచన చేయడమే ప్రభుత్వం కొంప ముంచింది. అలా కాకుండా దీనిలో జరిగిన అక్రమాల నిర్ధారణకు మొదటగా ఒక కమిటీని లేదా సీఐడీని వేయాల్సింది. ముందుగానే కోర్టుకి సమాచారమిచ్చి.. తాము విచారణకి దిగిన అవసరాన్ని తెలియజేసి.. తప్పులు నిర్ధారించి అప్పుడు అశోక్ గజపతిపై చర్యలు తీసుకుంటే వేరేలా ఉండేది.. కానీ ఒక విద్వేషపూరిత చర్య , జీవో వలన ఇటువంటి పరిణామాలే వస్తుంటాయి.. ఒక్క ఆలోచన వివాదం నుండి దూరం చేస్తుంది. ప్రభుత్వ ప్రతిష్ర్టా కాపాడుతుంది..


Share

Related posts

Nandamuri bala krishna : బిగ్ బ్రేకింగ్ : బాలయ్య అడ్డాలో వైసీపీ లీడర్ పై పోలీస్ కేసు !

somaraju sharma

సోనియా, రాహుల్‌లకు ఐటీ శాఖ నోటీసులు

somaraju sharma

బిగ్ బాస్ 4 : ఫైనలిస్టులు అయ్యే అయిదుగురు కంటెస్టెంట్ లు వాళ్ళేనా…?

arun kanna