Subscribe for notification

పవన్ లో పరిణతి… దివిస్ దారి చూపే దివిటి!

Share

 

 

దివిస్ పరిశ్రమ వల్ల నష్టపోతున్న బాధితులకు అండగా ఉండేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం కొత్త పాటలు గ్రామంలో ఏర్పాటు చేసిన సభ జనసేన శ్రేణులకు నూతన ఉత్సాహం కలిగించింది.. సభ ఆసాంతం విజయవంతమైంది. బాధితులను రోడ్డు వెంబడి కలుసుకుంటూ జనసేనాని వారితో మమేకం అయ్యేందుకు ప్రయత్నించడం… ఒక విశేషమైతే పవన్ కళ్యాణ్ బహిరంగ సభ లో ఎన్నడూ లేనంత పరిణతిని చూపించారు. ఒక రాజకీయ నాయకుడి తరహాలో కేవలం పిచ్చి ప్రకటనలకు విమర్శలకు పరిమితం కాకుండా మొత్తం సమస్యను వ్యవహరించేలా ప్రభుత్వానికి తగు సూచనలు చేసేలా ఆయన 45నిమిషాల ప్రసంగం సాగింది. గతంలో లాగా పవన్ ప్రసంగాల్లో ఊగిపోవడం అరుచుకోవడం లేకుండా.. ఎంతో హుందాగా పద్ధతిగా ఆయన మాట్లాడిన తీరును జనసేన నాయకులు స్వాగతిస్తున్నారు. ఇతర పార్టీల నాయకులు సైతం పవన్ సూటిగా సుత్తి లేకుండా విషయాన్ని చెప్పి… ఎక్కడ అనవసర హంగామా లేకుండా చక్కగా సభను నడిపించారని ఇది ఆయన లో పూర్తిస్థాయి రాజకీయ పరిణతికి నిదర్శనం అని చెబుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ మాటల్లో అంత స్పష్టత ఏమిటి అన్నది ఒక సారి పరిశీలిస్తే…

1. సమస్య పై అవగాహన

పవన్ కళ్యాణ్ బహిరంగ సభ కు వచ్చే మునుపే ఈ సమస్యపై పూర్తిస్థాయి స్టడీ చేసినట్లు కనిపిస్తోంది. బాధితుల చెప్పిన దాన్ని ఎప్పటికప్పుడు రాసుకుంటే ఆయన సొంతగా అధ్యయనం చేసి, గతంలోనూ జరిగిన భూపాల్ విశాఖ గ్యాస్ ఇన్సిడెంట్ లను ఉదాహరణగా చూపిస్తూ చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. ముఖ్యంగా మన దేశంలో పారి శ్రామిక చట్టాలు ఎంత దారుణంగా అమలవుతున్నాయి చెప్పే ప్రయత్నం చేశారు.

2. వద్దు అనలేదు…!!

కాలుష్య కారక పరిశ్రమ అయిన దీవిస్ పరిశ్రమ తాను పరిశ్రమలు ఇక్కడ పెట్టాలంటే ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే వ్యర్ధాలను ఎలాంటి ప్రభావం చూపకుండా ఎలా నిర్వీర్యం చేస్తారో శాస్త్రీయంగా చూపిన తరువాత పరిశ్రమను మొదలుపెట్టాలని, అప్పుడు తాము కూడా ఫ్యాక్టరీ కు మద్దతుగా ఉంటామని జనసేనని చెప్పారు. పారిశ్రామికీకరణకు తాము అడ్డం కాదని చెబుతూనే, విధ్వంసకరమైన పారిశ్రామికీకరణకు తమ పార్టీ ఎప్పుడు ఒప్పుకోదు అని పవన్ స్పష్టం చేశారు. దీనివల్ల జనసేన పార్టీ అనేది పరిశ్రమలను అడ్డుకుంటుంది అని అపవాదును ఆయన పక్కకు పెట్టి… పర్యావరణ రక్షణ పారిశ్రామికీకరణకు పార్టీ కట్టుబడి ఉందని చెప్పినట్లయింది.

3. బొమ్మ వేసి… నీలాదీత

గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి దివిస్ పరిశ్రమ తరలిస్తామని వారిని బంగాళాఖాతంలో కలిపేస్తారు అని చెప్పిన మాటలను సభలో ప్రదర్శించడం ద్వారా ఆయన విజ్ఞత ప్రదర్శించారు. దీంతోపాటు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇటీవల చంద్రబాబును శాసనసభ సాక్షిగా అవహేళన చేసిన విషయానికి ఇది కౌంటర్ గా పడింది. అయితే శాసనసభలో సీఎం వేసిన భజన వీడియో కు పవన్ వేసిన సీఎం మాటమార్చిన వీడియోకు ఎంతో వ్యత్యాసముంది సమస్య మీద అప్పట్లో అప్పట్లో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అందరికీ తెలిసేలా చేశారు.

4. సూటిగా సుత్తి లేకుండా

ఎన్నో వందల హెచరీస్ మరియు వేల కుటుంబాల మత్స్యకారులు ఉన్న చోట కాలుష్య కారక పరిశ్రమను పడితే అన్ని కుటుంబాలు సర్వ నాశనం అవుతాయని ఆ తర్వాత వచ్చే వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు అని పవన్ సూటిగా ప్రశ్నించారు. పరిశ్రమ మొదలు పెట్టకుండానే దానిలో కాలుష్యం ఏమి రాదని వెదజల్లడం సొంత కంపెనీలకు చెందిన ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికలు ఎంత మాత్రం నమ్మకం కాదంటూ లాజిక్ తో పాటు ఆయన ప్రశ్నించడం అందరిని ఆలోచింప చేసింది. ఈ ప్రాంతంలో తర్వాత గర్భిణీ లకు వచ్చే సమస్యలు చర్మ వ్యాధులకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

5. స్థానికులకు మద్దతుగా

ముఖ్యంగా పవన్ మాటల్లో స్థానికులు కోరుకున్నట్లుగా ప్రస్తుతం అరెస్టై జైలులో ఉన్న 36 మందిని వెంటనే విడుదల చేయాలని పదేపదే చేతులెత్తి అభ్యర్థించడం స్థానికుల మద్దతును కూడ పెట్టింది. పండగ వేళ జైలులో మగ్గుతున్న వారిని వెంటనే విడుదల చేయాలని కల్లబొల్లి మాటలు చెప్పి స్థానికులను మోసం చేయవద్దు అంటూ ఆయన సభ సాక్షి గా పాలకులను ప్రశ్నించారు.

6. ప్రజల బాధ్యత ప్రశ్నిస్తూ!

ఒక్క ప్రజా సమస్య మీద పోరాటం చేయడానికి వచ్చినప్పుడు ఆ ఉద్యమం తాలూకా ప్రజలను ప్రశ్నించడం అంటే చాలా పెద్ద విషయం. కానీ అది సభ సాక్షిగా పని చేసి చూపించారు. ఓటును అమ్ముకుంటే ఇలా నాయకులను ప్రశ్నించడం సాధ్యంకాదని, భవిష్యత్తు తరాల ను మన నోటుకు అమ్ముకొని తాకట్టు పెట్టవద్దని ఆయన సూచించారు. కొత్త పాటలు గ్రామంలో మీరే చెబుతున్నట్లు వైసీపీకి ఎక్కువ మెజారిటీ ఇచ్చారని ఇప్పుడు ఏం జరిగింది అంటూ ఆయన ప్రశ్నించారు. ఓట్లు ఏమో అధికార పార్టీకి వేసి పోరాటం మాత్రం తనను చేయమని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రజా క్షేత్రంలోనే ప్రజల్ని ఆయన ప్రశ్నించిన తీరు ముగ్ధుల్ని చేసింది.

** గతంలో పవన్ బహిరంగ సభలకు ప్రస్తుత పాకలు గ్రామ బహిరంగ సభకు చాలా వ్యత్యాసం ఉంది. గతంలో పవన్ సభలను విశ్లేషించిన రాజకీయ విశ్లేషకులు సైతం గతంలో సభలో పవన్ ఒక విషయాన్ని ప్రారంభించి దాన్ని ఎక్కడో ఎక్కడికో వెళ్లేవారని… కొత్త పాకలు సభలో మాత్రం సమస్య మీద స్పందించిన తీరు ఆయన ప్రశ్నించిన నైజం చెప్పుకోదగినవిగా ఉన్నాయని చెబుతున్నారు.


Share
Comrade CHE

Recent Posts

CM YS Jagan: ప్రధాని మోడీకి ప్రధాన అంశాలపై సీఎం వైఎస్ జగన్ వినతి.. ఈ సారి అయినా మోడీ మోక్షం లభిస్తుందా..?

CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…

2 hours ago

Somu Veerraju: మోడీ పర్యటన సందర్భంగా దుష్టశక్తుల భారీ కుట్ర అంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…

3 hours ago

Peanut Rice: ఎదిగే పిల్లలకు పీనట్ రైస్ చేసి పెట్టండి.. బలానికి బలం రుచికి రుచి..!

Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…

4 hours ago

AP Minister RK Roja: మంత్రి రోజా సెల్ఫీ ఫోటోకు నవ్వుతూ ఫోజు ఇచ్చిన ప్రధాని మోడీ

AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…

5 hours ago

Race Gurram: మరోసారి రేసుగుర్రం కాంబినేషన్ రిపీట్..??

Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…

6 hours ago

SSMB28: కన్నడ స్టార్ హీరోతో కలసి మహేష్ బాబు..??

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…

7 hours ago