NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Megastar Chiranjeevi : మళ్ళీ అన్నయ్య వస్తాడా??

Megastar Chiranjeevi :2009లో ప్రజారాజ్యం పేరుతో రాజకీయ సునామీలా దూసుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి… ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు తో పార్టీని కాంగ్రెస్లో కలిగిన తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పడం… ప్రస్తుతం సినిమాలు చేసుకోవడం వరుసగా జరిగిపోయాయి. అయితే మళ్లీ తాజాగా ఆయన రాజకీయ రీ ఎంట్రీ మీద ఊహగనాలు మొదలయ్యాయి. బుధవారం జనసేన పార్టీ మీటింగ్ లో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ త్వరలో చిరంజీవి పవన్ కు మద్దతు ఇస్తారని ఆయనకు తోడుగా వస్తారని చెప్పడం ఇటు మెగాస్టార్ అభిమానులను జనసేన పార్టీ కార్యకర్తలకు పెద్ద బూస్ట్ లా పని చేసింది. అయితే చిరంజీవి మళ్లీ రాజకీయంగా రీఎంట్రీ ఇస్తారా లేక జనసేన పార్టీకి బయటనుంచి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తార?? నాదెండ్ల మనోహర్ ఈ సమయంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది? అని అనేక సందేహాలు… చిరు రాజకీయ ప్రవేశం పై ఎన్నో రకాల ఊహాగానాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెర లేచాయి.

Megastar Chiranjeevi :IS BROTHER COMING?
Megastar Chiranjeevi IS BROTHER COMING

Megastar Chiranjeevi ఇప్పుడే ఎందుకు??

2022లో జమిలి ఎన్నికలు దేశవ్యాప్తంగా రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం సైతం సంకేతాలు ఇస్తోంది. అంటే కేంద్రం రాష్ట్రం రెండు ఎన్నికలు ఒకేసారి రానున్న తరుణంలో… ఈసారి రాజకీయ వేడి మరింత తారస్థాయిలో ఉండబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో టిడిపిని పక్కనపెట్టి… అధికార వైఎస్ఆర్సిపి కు బలమైన రాజకీయ ప్రత్యర్థి కావాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ జనసేన పార్టీ ల త్రాయనికి కావలసిన బలం ఇవ్వడానికి చిరంజీవి మద్దతు కచ్చితంగా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. చిరంజీవి కనుక ప్రచారంలోకి వచ్చి… 2009లో వచ్చేసింది ఖచ్చితంగా తాను తప్పేనని ఒప్పుకొని కచ్చితంగా ఓ కొత్త ప్రత్యామ్నాయానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరితే సానుభూతి కోణంలో చిరంజీవికి మంచి మార్కులు పడే అవకాశం లేకపోలేదు. ఇది కచ్చితంగా కాపులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అడపాదడపా కాపుల ఓట్లు ఉన్నప్పటికీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వీరు కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఈ రెండు జిల్లాలోని సుమారు 35 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. దీంతో పాటు మిగిలిన జిల్లాల్లోనూ కాపులు ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది. చిరంజీవి రాక ఖచ్చితంగా కన్ఫామ్ అయితే బిజెపి జనసేన లకు ఖచ్చితంగా అది ప్లస్ పాయింట్ అవుతుంది. రాబోయే ఎన్నికలు ఎంత తీవ్రంగా ఉంటాయి అని చెప్పేందుకు ఆయన రాక ఒక సంకేతం అవుతుంది. ఇప్పుడు దగ్గరికి వస్తున్న సమయంలో బిజెపి జనసేన పార్టీ కార్యకర్తలకు ఒక బూస్టప్ ఇచ్చే విషయాన్ని చెప్పాలనే కోణంలోనే నాదెండ్ల మనోహర్ ఈ కీలక ప్రకటన ఈ సమయంలో చేసినట్లు అర్థమవుతోంది.

కాపులే టార్గెట్!

బిజెపి జనసేన పార్టీలు ముఖ్యంగా కాపుల నే ప్రధాన టార్గెట్ గా వచ్చే ఎన్నికల్లో నమ్ము కోవడానికి సిద్ధమైనట్లు అర్థమవుతుంది. ఇప్పటికే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రత్యేకంగా భేటీ అయ్యే ఆయన మద్దతు కోరారు. ఆయనకు ఓ పని అప్పగించినట్లు సోము వీర్రాజు చెప్పారు. దీంతో పాటు త్వరలో జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇప్పటివరకు కాపులను పట్టించుకోని పవన్.. కొత్తగా కాపులను దగ్గరికి తీసుకోవడంలో ఈ ఫార్ములానే కీలకం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైతం జనసేన కు మద్దతుగా తమ్ముడికి అండగా రాజకీయాల్లోకి వస్తాడని ప్రకటించడంలో కాపులంతా ఐక్యంగా వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడం తోపాటు బీజేపీ జనసేన పార్టీ లకు కాపుల ఓట్లు పూర్తిగా పడేలా వ్యూహరచన చేస్తున్నట్లు అర్థమవుతోంది. మరి చిరంజీవి రకం కాపులు ఏ రకంగా తీసుకుంటారు?? కాపులంతా నమ్మిన ప్రజారాజ్యం పార్టీను కాంగ్రెస్లో విలీనం చేసేసిన చిరంజీవి ప్రజాక్షేత్రంలోకి ఎలా రాబోతున్నారు? చిరంజీవిని కాపులు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది భవిష్యత్తులో ఆసక్తిగా మారింది.

author avatar
Comrade CHE

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?