NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Israel: మిడిల్ ఈస్ట్ లో సరికొత్త రాజకీయ వాతావరణం ..ఇజ్రాయెల్ కి దూరంగా అమెరికా..??

Israel: మిడిల్ ఈస్ట్ లో ఎప్పుడూ ఏదో ఒక దేశం మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ప్రప్రథమంగా ఇజ్రాయెల్ పాలస్తీనా ల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇటీవల గత పది రోజులకు పైగా హామస్ అనే సంస్థకు చెందిన తీవ్రవాదులు గాజా ప్రాంతం నుండి దాదాపు నాలుగువేల రాకెట్లు ఇజ్రాయిల్ పౌరులు నివసిస్తున్న ఇళ్లపై దాడులు చేయడం జరిగింది. అయితే చాలా వరకు ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ రాకెట్ల గాలిలోనే నిర్వీర్యం చేయటంతో చాలావరకు ప్రాణనష్టం తప్పింది. అయితే ఈ క్రమంలో కొన్ని రాకెట్లు నేరుగా ఇజ్రాయిల్ పౌరులు నివసిస్తున్న ఇళ్లపై పడటంతో కొంత మంది మరణించడం జరిగింది.

Chronology samajhiye: A timeline of Israel-Palestine conflict - World News

దీంతో తీవ్రవాదులపై ప్రతి దాడులు చేసిన ఇజ్రాయిల్ .. ఉగ్రవాదులను ఏరివేతలో భాగంగా భారీగా గాజా ప్రాంతంపై వైమానిక దాడులు చేసి … టెర్రరిస్టులకు సంబంధించి సొరంగాలను ధ్వంసం చేసింది. ఈ పరిణామంతో అరబ్బు దేశాలు ఇజ్రాయెల్ దేశం పై గొడవకు దిగడానికి రావటంతో మధ్య ఆసియా లో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. సాధారణంగా ఇజ్రాయెల్ దేశాన్ని టచ్ చేయాలి అని అనుకునే అరబ్బు దేశాలు చాలావరకు అమెరికా దేశాన్ని చూసి భయపడతాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇజ్రాయిల్ దేశం వైపు కన్నెత్తి చూడలేదు అరబ్బు దేశాలు. అయితే ప్రస్తుతం కొత్త అధ్యక్షుడు జో బైడెన్ వైఖరి ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఉన్నట్లు అంతర్జాతీయ స్థాయిలో మొదటి నుండి వార్తలు వస్తున్నాయి.

 

కాగా ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశం పై అరబ్బు దేశాలు వ్యతిరేకంగా ప్లాన్స్ వేస్తున్న తరుణంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇజ్రాయిల్ దేశానికి అతను వ్యతిరేకి అన్న తరహాలో ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఇజ్రాయిల్- పాలస్తీనా మధ్య  వివాదాలు వారే పరిష్కరించుకోవాలని .. మధ్యలో ఎవరూ కలుగజేసుకోరాని కరాఖండిగా చెప్పారు. చాలావరకు ఇజ్రాయెల్ దేశానికి అంటీ అంటనట్టు గా గత అధ్యక్షులకు భిన్నంగా జో బైడెన్ తాజా కామెంట్లు ఉన్నాయి. ఈ పరిణామంతో మధ్య ఆసియా లో ఇజ్రాయెల్ దేశం పై అరబ్బు దేశాలు దాడి చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇప్పటికే పాలస్తీనా కి లెబనాన్, టర్కీ, పాకిస్తాన్ దేశాలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో మరికొన్ని ముస్లిం దేశాలు ఏకమయ్యే పరిస్థితి ఉందని .. ఇజ్రాయిల్ దేశం పై కచ్చితంగా దాడులు రాబోయే రోజుల్లో మరింతగా జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా సపోర్ట్ వుండటంతో చాలా వరకు ఇజ్రాయెల్ చుట్టుపక్కల ముస్లిం దేశాలు .. ఇజ్రాయిల్ తో కయ్యానికి రావాలంటే మొన్నటి వరకు  భయపడ్డాయి. కానీ అమెరికా కొత్త అధ్యక్షుడు వైఖరికి వ్యతిరేకంగా ఉండటంతో..అరబ్ ముస్లిం దేశాలన్నీ ఏకమవుతున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. దీంతో అరబ్బు దేశాలు ఒక్కసారిగా దాడి చేస్తే ఇజ్రాయెల్ ఏవిధంగా ఎదుర్కొంటుంది అనేది ఉత్కంఠగా మారింది.

 

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju