రాజ‌కీయాలు

Callaway Golf: హైదరాబాద్ లో “కాల్‌అవే గోల్ఫ్” కంపెనీ.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్..!!

Share

Callaway Golf: అమెరికాకు చెందిన “కాల్‌అవే గోల్ఫ్” సంస్థ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయింది. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో “కాల్‌అవే” డిజిటల్ టెక్నాలజీ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “కాల్‌అవే గోల్ఫ్” కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీ పరంగా హైదరాబాద్ లో మంచి మార్కెట్ ఉంది అని స్పష్టం చేశారు. క్రీడలతో పాటు దాని అనుబంధ రంగాల నుంచి అనేకమంది క్లైంట్ లు … తమ సాంకేతిక కేంద్రాలు ఏర్పాటు చేసుకోవటానికి హైదరాబాద్ వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు.

minister ktr inaugurated callaway company in hyderabad

రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా భారీగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ప్రపంచంలో పలు పేరుగాంచిన డిజిటల్ కంపెనీలు నగరంలో చాలా ఉన్నాయని లిస్ట్ తెలియజేశారు. ఆపిల్‌, గూగుల్‌, ఉబర్‌, నోవార్టిస్‌ వంటి సంస్థలు నగరానికి వచ్చాయని చెప్పారు. ప్రపంచంలోనే టాప్ మోస్ట్ సంస్థల రెండో పెద్ద క్యాంపస్‌లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అమెజాన్‌ అతిపెద్ద సెంటర్‌… ఈ కంపెనీ రెండో క్యాంపస్ కూడా హైదరాబాదులో ఉందని .. కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా “కాల్‌అవే గోల్ఫ్” హైదరాబాదులో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని.. అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. “కాల్‌అవే గోల్ఫ్” కి ప్రభుత్వం స్థలం ఇవ్వటం మాత్రమే కాదు.. అప్రూవల్ త్వరగా ఇస్తాం… క్లియరెన్స్ కూడా త్వరగా ఇస్తామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల పరంగా దేశంలో అన్ని నగరాల్లో కంటే హైదరాబాద్ ముందుందని..సంస్థ ప్రతినిధులకి పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.


Share

Related posts

KCR : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణకి సిబీఐ ? కేసిఆర్ కి బిగ్ పరేషాన్ ?

somaraju sharma

KCR: ద‌ళిత‌బంధు గురించి భ‌లే క‌వ‌ర్ చేసిన కేసీఆర్‌

sridhar

హై రిస్క్ లో ఇరుక్కుంటున్న జగన్..! “ఓటుకి నోటు” అసలు కారణం అదే..!!

Srinivas Manem
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar