NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Tirupati by poll: రఘురామతో రాజీనామా చేయిస్తారా? చంద్రబాబు సవాల్ కు పెద్దిరెడ్డి ప్రశ్న..!

minister peddireddy question to chandrababu naidu

Tirupati by poll: తిరుపతి ఉప ఎన్నిక Tirupati by poll రాష్ట్రాన్ని హీటెక్కిస్తోంది. నాయకులంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ-జనసేన పార్టీలు తమ శక్తివంచన లేకుండా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అగ్ర నాయకులంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. బీజేపీ-జనసేన నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం చేసి వెళ్లారు. టీడీపీ నుంచి ప్రస్తుతం చంద్రబాబు, లోకేశ్ అక్కడే మకాం వేసి ప్రచారం హోరెత్తిస్తున్నారు. వైసీపీ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ప్రచారం చేస్తున్నారు. 14న సీఎం జగన్ ప్రచారానికి రవాల్సి ఉండగా క్యాన్సిల్ అయింది. ప్రచారంలో భాగంగా నేతల సవాళ్లు.. ప్రతిసవాళ్లు జరుగుతున్నాయి. ఈక్రమంలో చంద్రబాబు చేసిన ఓ సవాల్ ను మంత్రి పెద్దిరెడ్డి అంగీకరిస్తూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు.

minister peddireddy question to chandrababu naidu
minister peddireddy question to chandrababu naidu

చంద్రబాబు ప్రచారంలో వైసీపీకి సవాల్ విసిరారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ఓడిపోతే.. మీ ఎంపీలు అందరూ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. దీనికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చంద్రబాబు సవాల్ ను స్వీకరిస్తూ ప్రతి సవాల్ విసిరారు. వైసీపీ ఓడిపోతే మా ఎంపీలంతా రాజీనామా చేస్తారు.. మీరు ఓడిపోతే మీ ముగ్గురు ఎంపీలతోపాటు రఘురామకృష్ణ రాజుతో కూడా రాజీనామా చేయిస్తారా? అని ప్రశ్నించారు. దీంతో రెండు పార్టీల మధ్య పొలిటికల్ ఫైర్ మరింత రగిలింది. ఇప్పటికే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి పెద్దిరెడ్డి చాలెంజ్ కూడా చేశారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి మధ్యే పొలిటికల్ చాలెంజ్ జరుగుతోంది.

 

నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు అక్కడికే ఆగిపోతాయని తెలిసిందే. కాకాపోతే.. ప్రజల్లోకి మరింతగా వెళ్లేందుకు ఇవి ఉపయోగపడతాయి. చంద్రబాబు విషయంలో మాత్రం మంత్రి పెద్దిరెడ్డి సై అంటే సై అంటున్నారు. ఇదంతా గెలుపు కోసం పోరాటమే అని ప్రజలకూ తెలుసు. మొత్తంగా రాజకీయంగా కాక రేపుతున్న తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్ధి 5 లక్షల మెజార్టీతో గెలుస్తారని.. తగ్గినా 4లక్షల మెజారిటీ ఖాయమని ఇప్పటికే వైసీపీ నేతలు ప్రకటించారు. గెలిచి పట్టు నిలుపుకోవాలని వైసీపీ, తమ ఉనికి చాటుకోవాలని టీడీపీ, గెలిచి ఏపీలో అడుగు ముందుకేయాలని బీజేపీ-జనసేన భావిస్తున్నాయి. ప్రజలు ఎవరి ఆకాంక్షను నెరవేరుస్తారో వేచి చూడాల్సిందే.

 

 

 

author avatar
Muraliak

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk