రాజ‌కీయాలు

KTR Talasani: ముదురుతున్న ఏపీ పై కేటీఆర్ వ్యాఖ్యల వివాదం.. మంత్రి తలసాని వైసీపీ పై ఫైర్..!!

Share

KTR Talasani: నిన్న ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ఏపీలో మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయని వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రస్థాయిలో వైసీపీ మంత్రులు మండిపడ్డారు. ఎవరికి వారు తమదైన శైలిలో కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన కౌంటర్లు ఇచ్చారు. అనంతరం కేటీఆర్..వివరణ ఇస్తూ..” నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. వేరే ఉద్దేశంతో అనలేదు. సీఎం జగన్ తో నాకు మంచి సోదర అనుబంధం ఉంది. ఆయన నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను” అని తెలిపారు.

minister talasani counters to ysrcp leaders

ఇదిలా ఉంటే ఇప్పుడు కేటీఆర్ వివరణ ఇచ్చినా గాని ఇంకా రాద్ధాంతం వివాదంపై జరుగుతూనే ఉంది. తాజాగా వైసీపీ నేతలు కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. శనివారం మీడియాతో మాట్లాడిన తలసాని… కేటీఆర్ పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎందుకు అంత ఉలిక్కిపాటు అని సెటైర్లు వేశారు. హైదరాబాద్ లో కరెంటు లేకపోతే ఎందుకు ఇక్కడే శుభకార్యాలు చేసుకుంటున్నారు అని మంత్రి బొత్స ని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.

minister talasani counters to ysrcp leaders

 

కరోనా చికిత్స ఆ సమయంలో ఎవరు ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారో… అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ నేతలు ఎందుకు అంత తొందర పడుతున్నారు ఎవరికి అర్థం కావడం లేదని.. సమావేశంలో హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధిని.. కేటీఆర్ వివరించారని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై ఏపీ సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా వైసీపీ నేతలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

 

 


Share

Related posts

ఏపిలో భూముల రీసర్వేకి శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్

somaraju sharma

ఆ ఏపీ మంత్రుల తలరాత చంద్రబాబు చేతిలో ???

sekhar

వారు తప్పు చేసి నింద మాపైనా?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar