రాజ‌కీయాలు

AP Ministers: మంత్రులకు నెలరోజులు.. వీళ్లకు మైనస్ మార్కులే..!

Share

AP Ministers: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ ప్రక్షాళన జరిగి దాదాపు నెలరోజులు కావస్తుంది.. ఈ మంత్రివర్గం ఎన్నికల టీం అని సీఎం జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా వెల్లడించారు..! సో.. వచ్చే ఎన్నికల వరకు మంత్రివర్గంలో దాదాపుగా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు..! మరీ కొన్ని విపత్కర పరిస్థితులు వస్తే తప్ప మంత్రి వర్గంలో మార్పులు జరగవు. ఈ ఎన్నికల టీమ్ ఎలా ఉంది..? గడిచిన నెలరోజుల్లో కొత్త మంత్రుల తీరు ఎలా ఉంది..? శాఖల మీద పట్టు సాధించారా..? లేదా రాజకీయంగా ఎప్పుడు అలవాటు ఉన్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డిని పొగిడి.., చంద్రబాబును, టీడీపీని తిట్టడానికి మాత్రమే పరిమితం అయ్యారా..? అనేది ఒక సారి పరిశీలిస్తే..!

AP Ministers: వనిత బాగా రాటుదేలాలి..!

కొంతమంది మంత్రుల వల్ల ప్రభుత్వానికి కొంత ఇబ్బందులు తలెట్టాయి అని నిర్మొహమాటంగా చెప్పుకోవచ్చు..! ముఖ్యంగా అత్యంత కీలకమైన హోం శాఖ మంత్రి తానేటి వనితకు ఈ నెలరోజులు క్లిష్టమైన సవాళ్లు ఎదురయ్యాయి. ఆమె హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో అత్యాచార ఘటనలు ఎక్కువ జరగడం, ఆమె వాటిని డీల్ చేయాల్సి రావడం.., నేరుగా మీడియా ఎదుట సమాధానాలు చెప్పాల్సి రావడంతో తడబాటు కనిపించింది..! ఆమెకు ఇబ్బంది కరంగా మారింది. ఆమె అంతకు ముందు స్త్రీ శిశు సంక్షేమ శాఖ నిర్వహించారు. అప్పుడు అంతగా మీడియాలో హైలైట్ కాలేదు. మీడియాతో పెద్దగా మాట్లాడే వారు కాదు. కానీ హోం శాఖ భాద్యతలు తీసుకున్న తరువాత ఖచ్చితంగా మీడియాతో మాట్లాడాలి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ప్రభుత్వం తరపున వివరణ ఇవ్వాలి. ఆ భాద్యత తానేటి వనితకు రావడంతో కొన్ని సవాళ్లు ఫేస్ చేసారు. మీడియా తో మాట్లాడే సందర్భంలో కొంత ఇబ్బంది పడ్డారు. “వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై మాట్లాడుతూ.. ఒక సారి తల్లుల పెంపకంలో తప్పు ఉంది అన్నట్లు, మరో సారి రేపల్లె ఘటన విషయంలో ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేయలేదని, వాళ్ళు ఎదో అనుకుంటే ఎదో జరిగింది” అని మాట్లాడి ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి దొరికి పోయారు. అత్యాచారాలు అనేవి చాలా సున్నిత మైన అంశం. వీటిపై చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆమె మాట్లాడిన తీరు పై సోషల్ మీడియా లో జరుతున్న ట్రోల్స్, ప్రతిపక్ష పార్టీ నేతల విమర్శల వల్ల ప్రభుత్వానికి నెగిటివ్ ప్రచారం ఎక్కువ అయింది. మంత్రి వనిత కు సున్నిత అంశాలపై మాట్లాడే అనుభవం లేకపోవడం ఇలా జరిగింది. రాను రాను అనుభవం మీద మాట్లాడటం నేర్చుకుంటారో చూడాలి..!

AP Ministers: కొందరితో చెడ్డపేరు..!?

ఇక విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితి కూడా కొంత క్లిష్టంగానే ఉందని చెప్పవచ్చు. మొదట బొత్స సత్యనారాయణకు ఆ శాఖ ఇష్టం లేదు..? ఆయన ఆ శాఖ నిర్వహించరు..? ఆయన ఆ శాఖ తీసుకోరు అని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. సీనియర్ మంత్రి కావడంతో అయన ఆ శాఖ తీసుకున్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఆయన చాలా సీనియర్. చాలా శాఖల మీద పట్టు ఉంది. పరిపాలన వ్యవస్థ మీద పట్టు ఉంది. ఆయన విద్యా శాఖ మంత్రి అయిన తరువాత పదవ తరగతి పరీక్ష పత్రాలు లీక్ కావడం ఒక సవాల్ గా మారింది. పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్ కు సంబందించినవి. రోజు పరీక్షా పత్రాలు లీక్ కావడం, వాటిపై రోజు వివరణలు ఇచ్చుకోవాల్సి రావడం ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. దీనితో ఆయన ఇబ్బందులు పడ్డారు.

* ఆ తరువాత అంబటి రాంబాబు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబందించి ప్రభుత్వం చెప్పిన గడువు ముంచుకువస్తుంది. 2022 ఖరీఫ్ ముంచుకువస్తుంది. డిసెంబర్ కు అయ్యే ఛాన్స్ లేదు. కేంద్రం పూర్తి గా నిధులు ఇస్తామని చెప్పడం లేదు. దయాఫ్రామ్ వాల్ లెక్కలు తెలియడం లేదు, ఎత్తు తగ్గిస్తారో అంతే ఉంచుతారో తెలియదు. పునరావాస ప్యాకేజీ పూర్తి స్థాయిలో 29వేల కోట్లు ఇవ్వగలరో లేదో తెలియదు. పోలవరం ప్రాజెక్టు కు సంబందించి ఎటువంటి క్లారిటీ లేదు. మరోవైపు వెలుగొండ తదితర చాలా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లపైనా క్లారిటీ లేదు. వీటిపై ఇబ్బందులు పడుతున్న సమయంలో మంత్రి అంబటి రాంబాబు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

* ఆ ముగ్గురు కీలక మంత్రుల శాఖల తీరు ఈ రకంగా ఉండగా మరో పక్క రాష్ట్రంలో కరెంట్ కోతలు గత నెల రోజులుగా ఎక్కువ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కరెంట్ కొతలతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ శాఖ మంత్రి గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీడియా ముందుకు వచ్చి దీనిపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం చేయలేదు. పత్రికల్లో కధానాలు, విద్యుత్ సమస్య పై ఇందన శాఖ కార్యదర్శి మాత్రం మీడియా కు వివరణ ఇస్తున్నారు. ఇలా నాలుగు శాఖల మంత్రులు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇక ఆర్ధిక శాఖ మంత్రి సవాళ్లు ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమి లేదు. ఆయన సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. పురపాలిక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆ శాఖ గురించి మాట్లాడిన సందర్భం లేదు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అడపా దడపా మీడియా ముందు మాట్లాడుతున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వర రావు చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. మిగిలిన శాఖ ల విషయాల్లో పెద్దగా వివాదాలు సవాళ్లు లేవు. సీనియర్ మంత్రులు ఉన్నా నాలుగు శాఖలు సవాళ్లు ఎదురవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదాలను, సవాళ్ళను ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది..!


Share

Related posts

Perni Nani : నిమ్మగడ్డ పై సీరియస్ కామెంట్లు చేసిన మంత్రి పేర్ని నాని..!!

sekhar

రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై లేటెస్ట్ కామెంట్స్ చేసిన రాఘవ లారెన్స్..!!

sekhar

బాబుకు నాని.. నానికి లోకేష్ కౌంటర్‌లు.. ! తూటాల్లా పేలుతున్న మాటలు..!!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar