మిస్ అవుతున్న జగన్, చంద్రబాబు .. వాళ్ళకి గోల్డెన్ ఛాన్స్ !

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గుళ్ళూ గోపురాలు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీకి సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే బిజెపి పార్టీ సౌండ్ గట్టిగా వినబడుతోంది. అంతర్వేది ఘటనతో పాటు విజయవాడ దుర్గ గుడి సింహాల దొంగతనం తో రాష్ట్రంలో ప్రభుత్వం పై వస్తున్న విమర్శలపై బిజెపి పెద్ద పాత్ర పోషించడం విశేషం. ఇటువంటి తరుణంలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణం ఏపీ బీజేపీ కి గోల్డెన్ ఛాన్స్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి.

CM YS Jagan gives strong counter to Chandrababu Naidu in AP Assemblyప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాల దాడులను సరైన రీతిలో బిజెపి డీల్ చేస్తే ఓటుగా సెంటిమెంటుని మలచుకుంటే ఏపీ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోవటం గ్యారెంటీ అని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ మొత్తం దేవాలయాలు చుట్టూ తిరుగుతూ ఉండటంతో ఈ విషయంలో బీజేపీ చాల ముందుందని చెప్పుకొస్తున్నారు. ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో మరో ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన ఉంటుంది. దీంతో ఇప్పుడు బిజెపి -జనసేన కూటమి కన్ను తిరుపతి ఎంపీ సీటుపై పడినట్లు సమాచారం.

ఇందువల్లనే వైయస్ జగన్ తిరుపతి పర్యటనకు సంబంధించి విపక్షాలు డిక్లరేషన్ అనే రాద్ధాంతం చేస్తున్నట్లు టాక్. ఈ వివాదం ఎఫెక్ట్ వచ్చే ఉప ఎన్నిక వరకు రాష్ట్రంలో ఉంటే కచ్చితంగా జరగబోయే ఉప ఎన్నిక బీజేపీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉందని మేధావులు అంటున్నారు. ఈ విషయంలో చాలా వరకు జగన్- చంద్రబాబు మిస్ అవుతున్నారని మత రాజకీయాల విషయంలో కమలం పార్టీ ముందుందని…. సెంటిమెంట్ పండితే బిజెపి తిరుపతి ఎంపీ స్థానం దక్కించుకునే అవకాశం ఉన్నట్లు చాలా మంది భావిస్తున్నారు. బీజేపీ తరహాలోనే చంద్రబాబు కామెంట్లు చేయటంతో చాలావరకు టిడిపి ఈ ఉప ఎన్నికలలో ఆటలో అరటిపండులా మిగలటం గ్యారెంటీ అనే టాక్ మరోపక్క వినబడుతోంది.