NewsOrbit
రాజ‌కీయాలు

బీజేపీ “బండి”కి సొంత ఎమ్మెల్యే వేస్తున్న పంక్చర్..!

mla giving shiver to bjp in ghmc elections

హైదరాబాద్ లో రాజకీయాలు రోజురోజుకీ రసవత్తరంగా మారిపోతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఏకంగా అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. వాదనలు, దూషణలు, హామీలతోపాటు అలకలు కూడా ఈ ఎన్నికల్లో స్పెషల్ గా నిలుస్తున్నాయి. 2016లో ఏకచత్రాధిపత్యం చూపించిన టీఆర్ఎస్ కు ఈసారి ప్రతిబంధకంగా బీజేపీ నిలుస్తోంది. రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. దుబ్బాక దెబ్బతో కుదేలైన టీఆర్ఎస్ ఎదురీదుతుంటే.. అక్కడ విజయం సాధించిన బీజేపీ సై అంటోంది. ఇంత ఉత్సాహంలో ఉన్న బీజేపీకి సొంత పార్టీలోనే ముసలం పుడుతోంది. టికెట్ దక్కలేదని ఇంటి పోరును రచ్చకెక్కిస్తున్నారు.

mla giving shiver to bjp in ghmc elections
mla giving shiver to bjp in ghmc elections

కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందా..

టికెట్టు దక్కలేదని అసంతృప్తులు ఏకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే రచ్చ చేస్తున్నారు. మొదట్లో కూకట్ పల్లి, తర్వాత కుత్భుల్లాపూర్, ఇప్పుడు గన్ ఫౌండ్రీ.. ప్రాంతాల బీజేపీ నాయకులు టికెట్టు దక్కలేదని తమ ఆగ్రహం వెలిబుచ్చారు. కూకట్ పల్లి, కుత్భుల్లా పూర్ నాయకులు స్థానికంగా గొడవ చేసి నాయకులపై విమర్శలు చేస్తే.. గన్ ఫౌండ్రీ నాయకులు ఏకంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోనే రచ్చ చేశారు. టికెట్ దక్కించుకున్న ఓంప్రకాశ్ వర్గీయులతో శైలేంద్ర యాదవ్ వర్గీయులు కోట్లాడారు. ఆఫీస్ ఫర్నీచర్ ను దారుణంగా ధ్వంసం చేశారు. పార్టీ నాయకులు టికెట్లు అమ్ముకున్నారని నినదించారు. పార్టీలో మొదటినుంచీ కష్టపడిన వారికి కాకుండా టీడీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారంటే అగ్ర నాయకులును దూనమాడారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు.

మేల్కోకుంటే.. బీజేపీకి నష్టమే..

తన వర్గానికి టికెట్లు కేటాయించలేదని.. బండి సంజయ్ మోసం చేశారంటూ ఏకంగా ఆడియో రిలీజ్ చేసేశారు. గన్ ఫౌండ్రీ, బేగం బజార్ టికెట్లు తన అనుచరులకు ఇప్పించుకోలేక పోయారని తెలుస్తోంది. నాయకుల ఇష్టారాజ్యంపై జాతీయ నాయకత్వానికి లేఖ రాస్తానని హెచ్చరించారు. 150 డివిజన్లలో తాను ఎక్కడా ఇన్‌వాల్వ్ కానని స్పష్టం చేశారు. ఇవన్నీ బీజేపీ ఉత్సాహానికి మోకాలడ్డే ఘటనలని చెప్పాల్సిందే. ప్రచారం, గెలుపుపై పెట్టిన శ్రద్ధ అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు చేయడం లేదు. లక్ష్యం నెరవేర్చుకునే ప్రయత్నాల్లో మాత్రమే ఉన్న బీజేపీకి ఇవన్నీ ప్రతిబంధకాలు అవుతున్నాయి. వెంటనే బుజ్జగింపులు చేయకపోతే అధికార పార్టీ ఈ ఘటనలను తనకు అనుకూలంగా మార్చుకోవడం తథ్యం. మరి.. బండి.. బీజేపీ బండిని ఎలా నడిపిస్తారో చూడాలి.

 

author avatar
Muraliak

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju