NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

MLA RK Roja: రోజా మరో సారి సెన్సేషన్..! గాలి భానును ప్రోత్సహిస్తున్న ఆ మంత్రి..!?

MLA RK Roja: Struggling.. Targeting BY YSRCP

MLA RK Roja: నగరి ఎమ్మెల్యే రోజా.. నాడుటీడీపీలో ఉన్నప్పుడు నచ్చిన స్థానం ఇవ్వలేదని పార్టీతో కొట్లాడారు.. వైసీపీలోకి వచ్చాక నచ్చిన స్థానంలో తీసుకుని.. గెలిచి.. ప్రతిపక్షంలో ఉంటూ నాడు టీడీపీలో కొట్లాడారు.. ఇప్పుడు రెండున్నరేళ్ల కిందట అధికార పక్షం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ చీటికీ.., మాటికీ పార్టీలో తన శత్రువులతో కొట్లాడుతున్నారు.. గతం కంటే ఎక్కువగా.. తన మొత్తం రాజకీయ జీవితంలోనే ఎక్కువగా ప్రస్తుతం ఆమె వివాదాల్లో ఉంటున్నారు..! మూడు రోజుల కిందట ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకవర్గంగా ఉన్న చక్రపాణి రెడ్డికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇవ్వడంపై ఆమె తీవ్ర మనస్థాపానికి గురైందని.. రాజీనామా చేసేస్తారని వార్తలు వచ్చాయి.. ఇప్పుడు అవి కాదని.. అక్కడ టీడీపీ ఇంచార్జి గాలి భాను ప్రకాష్ ని వైసీపీ ముఖ్యులు కొందరు ఎంకరేజ్ చేస్తున్నారని.. రోజాను ఓడించాలని టీడీపీని ప్రోత్సహిస్తున్నారని ఆమె వర్గం కొత్త అంశాలను తెరపైకి తేవడమే నగరిలో సరికొత్త అంశంగా మారింది..!

MLA RK Roja: ఏం జరిగింది..!? ఏం జరగనుంది..!?

నిండ్ర మండల పరిషత్ ఎన్నిక సందర్బంగా రోజా, చక్రపాణిరెడ్డి వర్గానికి మధ్య తీవ్ర విభేధాలు చోటుచేసుకున్నాయి. బాహాటంగా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకునే వరకూ వెళ్లింది. అయితే వీరి మధ్య వివాదాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుని ఇరువర్గాలను రాజీ చేసే ప్రయత్నం చేయలేదు. దీంతో వారి మధ్య విబేధాలు ఇంకా తారా స్థాయికి చేరాయి. రోజాను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న చక్రపాణిరెడ్డికి రాష్ట్ర స్థాయిలో కీలక పదవి ఇచ్చారు. నగరి మున్సిపాలిటీ పరిధిలో రోజాను వ్యతిరేకిస్తున్న కేజే కుమార్ సతీమణికి ఈడిగ కార్పోరేషన్ చైర్మన్ పదవిని గత ఏడాది ఇచ్చారు. రోజా వ్యతిరేక వర్గానికి పార్టీ అధిష్టానం మద్దతు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అందుకే రోజా ఈ వ్యవహారాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి రోజా పార్టీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే గా పేరుంది. తెగువ, తెగింపు ఉన్న నాయకురాలు. టీడీపీని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. నారా చంద్రబాబు, లోకేష్ ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటారు. ఈ కారణంగా ఆమెపై టీడీపీ క్యాడర్ తీవ్ర కోపంతో ఉంటారు. మరో పక్క పార్టీ ఆమె పరిస్థితి అంత బాగోలేదని ఈ సంఘటనలను బట్టి తెలుస్తోంది.

MLA RK Roja: Struggling.. Targeting BY YSRCP
MLA RK Roja Struggling Targeting BY YSRCP

భానుకి వైసీపీ అండ..!?

తాజాగా నగరి టీడీపీ ఇన్ చార్జి గాలి భానుప్రకాశ్ కు వైసీపీ నుండి మద్దతు పెరుగుతోందని వార్తలు వినబడుతున్నాయి. ఈ వార్తలు నిజమా కాదా అని పరిశీలిస్తే.. ఎమ్మెల్యే రోజా అవినీతికి పాల్పడుతున్నారనీ, చిన్న చిన్న విషయాల్లోనూ ఆమె వాటాలు తీసుకుంటున్నారనీ భానుప్రకాశ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. భానుప్రకాశ్ చేసిన ఆరోపణలపై రోజా తీవ్రంగా స్పందించారు. “ఇటువంటి లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడితే మూతి పగులుతుంది. ఆధారాలు లేకుండా ఏమి మాట్లాడవద్దు. ఏదైనా ఉంటే ఆధారాలతో మాట్లాడండి. మీ చేత ఎవరు మాట్లాడిస్తున్నారో తెలుసు. మీ వెనుక ఎవరు ఉన్నారో తెలుసు” అంటూ వైసీపీ ఓ వర్గం ఆయనతో ఆరోపణలు చేయిస్తుంది అన్నట్లుగా కౌంటర్ ఇచ్చారు. తనకు వ్యతిరేకంగా పార్టీలో ఓ వర్గం పని చేస్తుందనీ, ఆ వర్గానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో కొందరు నేతలు మద్దతు ఇస్తున్నారని రోజాకు తెలుసు. ఈ విషయాలు జిల్లాలోని రాజకీయ వర్గాలకు తెలుసు.

MLA RK Roja: Struggling.. Targeting BY YSRCP
MLA RK Roja Struggling Targeting BY YSRCP

ఆ నాయకుల మద్దతుతోనే గాలి భానుప్రకాశ్ ఆరోపణలు చేస్తున్నారనేది రోజా వాదనగా ఉంది. ఇది ఎంత వరకూ నిజమనేది స్థానిక నాయకులకు, జిల్లా నేతలకు తెలుసు. అవినీతి అక్రమాలకు కారకులు ఎవరో కూడా స్థానికులకు తెలుసు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రోజాకు వ్యతిరేకంగా వైసీపీలో ఒక వర్గం పని చేస్తుందన్న వాదన ఉండగా, కొందరు వైసీపీ నేతలు టీడీపీ ఇన్ చార్జితో చేతులు కలిపారు అనేది కొత్త పాయింట్ వెలుగులోకి వచ్చింది. పార్టీ నాయకులే ప్రత్యర్ధి పార్టీ నాయకుడితో కలిసి ఇంటిపోరును బజారుకు ఈడిస్తే అది పార్టీకే తీవ్ర నష్టం కల్గిస్తుంది అన్నది రోజా వర్గం వాదనగా ఉంది..!

author avatar
Srinivas Manem

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju