NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Narendra Modi-Amit shah: ప్రాంతీయ పార్టీల ముందు పని చేయని మోదీ-షా మంత్రం..?

Hetero Drugs Scam: Another Corporate Surrender to BJP

Narendra Modi-Amit shah: మోదీ, అమిత్ షా Narendra Modi-Amit shah ద్వయం దూకుడును రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగ్గించాయా? పరిస్థితి చూస్తే అలానే ఉందని చెప్పాలి. ఓపక్క కరోనా కట్టడి వైఫల్యం ఆరోపణలు.. మరోవైపు ఎన్నికల్లో వైఫల్యం. ప్రాంతీయ పార్టీల స్థానంలో రాష్ట్రాల్లో పాగా వేయాలనుకున్న బీజేపీ ఆశలకు ఎక్కడికక్కడ గండి పడుతూనే ఉంది. ఎంపీ ఎన్నికల్లో వచ్చిన సీట్లు ఆధిక్యత చూసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే నిరాశే ఎదురవుతోంది. జాతీయస్థాయిలో మోదీ కావాలనుకున్నారు కానీ.. రాష్ట్రాల్లో కాదని తేలిపోయింది. ఓటర్ల తీరు బీజేపీకి మింగుడుపడనిదే. 2019 బెంగాల్ ఎంపీ ఎన్నికల్లో 18 ఎంపీ సీట్లు గెలిచిన ధైర్యంతో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రాన్ని కైవసం చేసుకుందామనుకున్న వారి ఆశలు ప్రాంతీయ పార్టీ దెబ్బకి అడియాశలే అయ్యాయి.

modi and shah not up to the mark in states
modi and shah not up to the mark in states

తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి హవా సాగిద్దామనుకుంది. కానీ.. డీఎంకే కొట్టిన దెబ్బ చాలా గట్టిగా తగిలింది. కేరళ ఎన్నికల్లో గతంలో వచ్చిన ఒక్క సీటు కూడా పోయి అధికారం అనేది అల్లంత దూరంలోనే ఆగిపోయింది. ఏపీలో సరేసరి. 2014లో టీడీపీతో కలిసి వెళ్లి మెల్లగా పాగా వేద్దామనుకుంటే.. తనకు అడ్డొస్తే ఎవరైనా ఒకటే అనే చంద్రబాబు చాలా తెలివిగా బీజేపీని దూరం పెట్టేశారు. జనసేనతో కలిసి వెళ్లాలనుకున్నా.. సభలకు వచ్చిన జనం ఓటేయట్లేదు. తెలంగాణలో కూడా దుబ్బాక స్పీడు.. జీహెచ్ఎంసీలో కాస్త కనిపించినా సాగర్ ఎన్నికతో ఒన్ విన్ వండర్ గా మారిపోయింది. కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్ ల్లో అధికారంలో ఉన్నా.. ఎలా సాధించుకుందో చూసాం.

ఆపక్క మహారాష్ట్రలో శివసేన కొట్టిన దెబ్బకు బీజేపీకి కళ్లు బైర్లు కమ్మాయనే చెప్పాలి. ఈపక్క ఒడశాలో నవీన్ పట్నాయక్ కూడా బీజేపీతో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇలా ప్రాంతీయ పార్టీల చేతిలో బీజేపీకి దెబ్బలే తగులుతున్నాయి. కేంద్రం తీసుకునే నిర్ణయాలకు వత్తాసు పలికే ఏపీ సీఎం జగన్ కూడా బీజేపీ ఇక్కడ పాగా వేస్తామంటే ఒప్పుకుంటారా? ఇదే పరిస్థితి ప్రతిచోటా. బెంగాల్ దెబ్బకు ఈ విషయంల బీజేపీకి మరింతగా బోధపడినట్టే. దేశమంతా మోదీ మేనియా ఉన్న సమయంలోనే ఇలా రాష్ట్రాల్లో కుదురుకోలేకపోయింది. ఇక ప్రస్తుత కరోనా విలయానికి.. రీసెంట్ ఎన్నికల్లో ఓటమి దెబ్బ చూశాకైనా భవిష్యత్తులో రాష్ట్రాల్లో పాగా వేయాలనే ఆలోచన చేస్తుందా..? చూడాలి..!!

author avatar
Muraliak

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk