అభివృద్ధి పనులను ప్రజలకు వివరించండి : మోదీ

ఢిల్లీ, జనవరి 13: ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ శ్రేణులకు సూచించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆయన తమిళనాడులోని బిజెపి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. యువత, రైతులు, మహిళలతో పాటు సమాజంలో అన్ని వర్గాలు ఎన్‌డిఎ ప్రభుత్వంపై నమ్మకం ఉందని అన్నారు. పని చేసే వారికి ఎప్పుడూ మద్దతు తెలుపుతారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు పడుతొందనీ, మధ్యలో ఎటువంటి అవకతవకలకు అస్కారం ఉండదని మోదీ అన్నారు.

వస్త్ర పరిశ్రమ రంగంలో తమిళనాడు ప్రసిద్ధి చెందింది. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకుంటున్నామని మోది పేర్కొన్నారు. సూక్ష్మ, మద్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుతుందనీ, అది నా వల్లనో, ఏ నాయకుడి వల్లనో కాదని బిజెపి కార్యకర్తల వల్ల సాధ్యమవుతుందని మోదీ అన్నారు.

మన అభివృద్ధి ఎజండా మరింత ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలు బిజెపికి, దేశానికి చాలా ముఖ్యమైనవని మోదీ వ్యాఖ్యానించారు