NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అవినీతి మరకే లేదు : మోదీ

డిల్లీ, జనవరి 12: దేశ చరిత్రలోనే తొలి సారిగా ఏ అవినీతి ఆరోపణలు లేకుండా ఎక్కువ కాలం అధికారంలో కొనసాగిన ప్రభుత్వం తమదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ, రామ్‌లీలా మైదానంలో జరుగుతున్న బిజెపి జాతీయ సమ్మేళనంలో రెండవ రోజైన శనివారం ఆయన పాల్లొని ప్రసంగించారు. తొలుత వివేకానందుడికి నివాళులర్పించారు. అవినీతి ఆరోపణలు లేకుండా పరిపాలన అందించామని చెప్పడానికి గర్వపడుతున్నానని మోదీ అన్నారు.

దేశం మొత్తం బిజెపి వైపు చూస్తున్నది. ప్రతి ఒక్కరూ బిజెపిపై నమ్మకం ఉంచారు. కార్యకర్తల శక్తి, సమిష్టి కృషి వల్ల వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. కార్యకర్తలు అందరూ సుశిక్షితులు, సంస్కారవంతులు. కార్యకర్తల త్యాగాలపై భారతీయ జనతా పార్టీ బలీయమైన శక్తిగా ఎదిగిందని ఆయన కొనియాడారు. ఉన్న రిజర్వేషన్‌లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించామని అన్నారు.

పదేళ్ల యుపిఎ పాలన అవినీతితోనే కొనసాగిందని విమర్శిస్తూ..దశాబ్దాల నిర్లక్ష్యంతో రైతులు కుదేలు అయ్యారని అన్నారు. ఈ దేశ రైతులకు నూతన జవసత్వాలు ఇచ్చేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నదనీ, అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు.

అద్భుతాలు చేయగలిగే శక్తి, సామర్ధ్యాలు దేశ యువతకు ఉన్నాయి. ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా కొత్త పథకాలను తీసుకువస్తున్నాం. ప్రసూతి సెలవులను ఆరు నెలలకు పెంచామని ఆయన అన్నారు. సబ్ కా సాత్ అనేది ప్రభుత్వం ఒక దాని వల్ల రాదు ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఉండాలని మోదీ పిలుపు నిచ్చారు.

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ ఏ మహాకూటమీ తమను ఓడించలేదనీ, 2019 ఎన్నికల్లో బిజెపి విజయం సాధిచండం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

Leave a Comment