కరోనా వ్యాక్సిన్ గురించి జాతీయ చానల్ లో గుడ్ న్యూస్ చెప్పిన మోడీ..!!

మహమ్మారి కరోనా వైరస్ ఎఫెక్ట్ దేశంలో భారీ స్థాయిలోనే ఉంది. రోజు రోజుకి పాజిటివ్ కేసు లో రికార్డు స్థాయిలో నమోదు కావడంతో పాటు మరణాలు కూడా అదే రీతిలో సంభవిస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా మరో పక్క రికవరీ రేటు కూడా బాగానే ఉంది. కాగా రాబోయేది శీతాకాలం కావటంతో దేశంలో వైరస్ ప్రభావం భారీ స్థాయిలో ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు భారీ స్థాయిలో వస్తున్నాయి.

BJP Rejected Pluralism, Targeting Muslims': TIME Editor As PM Modi's Features On 100 Most Influential People Listవిమర్శలు మాత్రమే కాకుండా లేనిపోని అనుమానాలు కూడా జనాల్లో నెలకొంది. కేవలం బీజేపీ పార్టీని గెలిపిస్తేనే వ్యాక్సిన్ ఉచితం ఉన్నట్టు వస్తున్న వార్తలు వైరల్ కావడంతో తాజాగా కేంద్రం స్పందించింది. పూర్తి విషయంలోకి వెళ్తే దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని మోడీ చెప్పారు. వ్యాక్సిన్ తయారీలో పురోగతి ఉందని అన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుతుందని మోడీ స్పష్టం చేశారు.

 

అంతేకాకుండా దేశంలో వ్యాక్సిన్ పంపిణీ వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం కరోనా సెకండ్ వేవ్ తో ఆందోళన చెందుతున్న వేళ ప్రధాని మోడీ ఊరటనిచ్చే ఈ వార్త తెలపడంతో భారతీయులలో సంతోషం నెలకొంది. యాక్షన్ అందుబాటులోకి రాగానే ప్రతి ఒక్కరికి అందిస్తామని ప్రకటించారు. ఇటీవల ఒక జాతీయ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా ముందుగా ఫ్రంట్లైన్ వర్కర్స్ కి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని మోడీ స్పష్టం చేశారు.