NewsOrbit
Featured టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

మోడీ మౌనమేలనోయి..!!

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది ప్రజలను తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు యావరేజ్ గా రోజుకు 40వేలు వస్తున్నాయి. నేటి వరకు దేశవ్యాప్తంగా 13,36, 801 పాజిటివ్ కేసులు నమోదు కాగా 31,358 మంది కరోనాతో మరణించారు. 8,49,432 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రపంచ పటంలో కరోనా కేసులో భారత దేశం రెండవ స్థానంలోకి వెళ్ళబోతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే భారత దేశం మొదటి స్థానంకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. కరోనా ప్రస్తుతం దేశంలో పిక్ స్టేజిలో ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోరు మెదపడం లేదు. మాట్లాడటం లేదు. వీడియో సందేశాలు లేవు. కరోనాపై మోడీ మీడియా సందేశం ఇచ్చి నెల రోజులు దాటి పోయింది. ముఖ్య మంత్రులతో సమీక్షలు చేయడం లేదు. కరోనా ప్రారంభ దశలో హీరోగా తెగ హడావుడి చేసిన ప్రధాన మంత్రి మోడీ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అయన వద్ద కూడా సమాధానం లేదా? కరోనా కట్టడి చేతకాక చేతులు ఎత్తేసినట్లేనా? అనుమానాలు ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి.

కరోనా ప్రారంభ దశలో మోడీ తీసుకున్న చర్యలు అయనను హీరోను చేశాయి. జాతిలో సంఘటిత స్ఫూర్తి కల్గించేందుకు మోడీ తీసుకున్న చర్యలకు రాజకీయాలకు అతీతంగా ప్రజలు సహకరించారు. అయన చప్పట్లు కొట్టమంటే కొట్టారు. దీపాలు వెలిగించమంటే వెలిగించారు. జనతా కర్ఫ్యూనకు పిలుపునిస్తే కాశ్మిర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో ప్రజలు కర్ఫ్యూ నకు స్వచ్చందంగా సహకరించి అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం అని నిర్ణయించి అమలు చేసిన సందర్భంలోనూ కష్టమైనా ప్రజలు భరించారు.

 

వేల సంఖ్యలో కరోనా కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ అమలు చేసి కేసులు లక్షల సంఖ్యలో ఎగబాకుతున్న సమయంలో ఆన్ లాక్ ప్రక్రియ షురూ చేసి లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో పరిస్థితులు చేయి దాటి పోతుందనే మాటలు వినిపిస్తున్నాయి.

తొలి నుండి సోషల్ మీడియా, మీడియా మోడీకి చాలా అనుకూలంగా ఉండేది. ఆయనను హీరోగా కీర్తిస్తూ ఉండేవి. అయనపై వ్యతిరేక పోస్ట్ లు చాలా అరుదుగా ఉండేవి. అయితే కరోనా పీక్ స్టేజ్ లో ఉన్న ఈ తరుణంలో మోడీ నోరు మెదపకపోవడంతో సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. సెటైర్లు వేస్తూ వ్యంగ్య చిత్రాలతో సోషల్ మీడియా ఆడుకుంటుంది. .

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju