పోలవరంపై ప్రధాని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు: మంత్రి దేవినేని ఉమ

Share

విజయవాడ, జనవరి 3: పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని రాష్ర్ట జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. గురువారం మంత్రి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ సక్రమంగా జరగడంలేదని చెప్పడాన్ని ఖండించారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా ఏపీ సీఎం చంద్రబాబు రాజీపడకుండా పనులను వేగవంతం చేశారన్నారు.
ప్రధామంత్రి మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీలోని పలు పార్లమెంట్ నియోజకవర్గాల బూత్ స్థాయి కార్యకర్తలతో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు.
ప్రాజెక్టులో 11లక్షల 15వేల క్యబిక్ మీటర్లకు గాను 9కోట్ల33 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. కేంద్రం ఆధీనంలోని అధికారులు ప్రాజెక్టును పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. దేశం యావత్తూ పోలవరం పనుల గురించి గొప్పగా చెప్పుకుంటుటే ప్రధాని ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పోలవరం కాపర్ డ్యాం పనులు కూడా వేగంగా పూర్తి చేసి గిన్నీస్ రికార్డు సాధించడం జరిగిందన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ రెండు సార్లు పోలవరం సందర్శించి అధికారులను, ప్రభుత్వాన్ని అభినందించారన్నారు.
ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా సర్ధార్ సరోవర్ ప్రాజెక్టు కూడా కట్టలేకపోయారనీ, ప్రధాని అయిన తరువాత ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారన్నారు. గుజరాత్‌కు ఒక న్యాయం ఏపీకి మరొక న్యాయం అన్నట్లుగా ప్రధాని పనితీరు ఉందన్నారు. ఇప్పటికైనా ప్రధాని వాస్తవాలు తెలుసుకుని ప్రాజెక్టకు నిధులను విడుదల చేయాలని మంత్రి ఉమ డిమాండ్ చేశారు.


Share

Related posts

సుప్రీం కమిటీ నుండి తప్పుకున్న భూపేందర్ సింగ్ మాన్

somaraju sharma

బ్రేకింగ్: ఎయిమ్స్ నుండి డిశ్చార్జ్ అయిన అమిత్ షా

Vihari

బద్ధకం వీడు హైద్రాబాద్ : ఓటింగ్లో కొత్త రికార్డు

Special Bureau

Leave a Comment