NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

MP Raghuramakrishna Raju: రఘురామ సెల్ ఫోన్ ఏమైనట్టు..? ఎవరి వాదన వారిదే..!!

RaghuramakrishnamRaju Case: Comedian or Hero..!? KLey Analysis

MP Raghuramakrishna Raju: ఎంపీ రఘురామకృష్ణ రాజు MP Raghuramakrishna Raju అంశం ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చనీయాంశమైపోయింది. ఆయన అరెస్టు దగ్గర నుంచి పరిస్థితులు మారిపోయాయి. అసలు విషయం పక్కకు వెళ్లి ఆయనను పోలీసులు కొట్టడం దగ్గరనుంచి.. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం.. ఇప్పుడు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఎంపీలకు చెప్పుకుని సానుభూతి తెచ్చుకునే వరకూ వెళ్లింది. ఇదే అంశంపై ఆయన మరింత దూకుడు పెంచారు. రెండు రోజుల క్రితం పీవీ రమేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. రఘురామరాజు సెల్ ఫోన్ నుంచి తనకు మెసేజెస్ వస్తున్నాయనేది ఆ ట్వీట్ సారాంశం. అయితే.. పోలీసులు అరెస్టు చేసి తన ఫోన్ స్వాధీనం చేసుకున్నారని.. మరి మెసేజెస్ ఎలా వెళ్తున్నాయో దర్యాప్తు చేయాలని రఘురామ డిమాండ్ చేయడం సంచలనం రేపుతోంది.

mp raghuramakrishna raju cell phone issue
mp raghuramakrishna raju cell phone issue

కోటంరాజు వెంకటేశ్ శర్మ అనే న్యాయవాది చెప్పిన అభిప్రాయాన్ని వైసీపీ అనుకూల మీడియా చెప్తూ.. పోలీసులు జప్తు చేసిన వస్తువును పోలీసులు దర్యాప్తు విషయంలో పోలీసులు ఎప్పుడైనా చెప్పొచ్చని అంటున్నారు. దీనిపై రఘురామ బహిరంగంగా వ్యాఖ్యానించడం దర్యాప్తు అధికారులను బెదిరించడమే అవుతుందని అంటున్నారు. ఇది సీఐడీ అభిప్రాయం తీసుకుని చెప్పిన విషయంలా లేదనేది ఓ వాదన. మరోవైపు.. రఘురామ అరెస్టు జరిగిన సమయంలో అధికారులు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుంటే.. తాము గట్టిగా అడిగేసరికి అధికారులు ఫోన్ ఇచ్చేసినట్టు రఘురామ కుమారుడు భరత్ చెప్పిన వీడియోను వైసీపీ సోషల్ మీడియా వింగ్ చూపిస్తోంది. ఈ సందర్భంగా పై వాదన ఏంటో అర్ధంకాని పరిస్థితి నెలకొంది.

RRR Case in Supreme Court: Medical Report details

Read More:YS Jagan: ఒక డైరీ వెనుక మొండి ధైర్యం..! జగన్ అమూల్ కథలో నీతి ఏమిటి..!?

అసలు ఈ వివాదం మొదలవడానికి కారణమైన పీవీ రమేశ్ చెల్లెల్ని.. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వివాహం చేసుకోవడం.. ప్రస్తుతం వారి కుటుంబాల మధ్య వైరం ఉండటంతో అసలు ఈ మెసేజుల అంశం ఎవరికీ అర్ధం కాకుండా ఉంది. ఈ అంశంలో ఇప్పుడు సీఐడీ కీలకంగా మారింది. ఓవైపు పీవీ రమేశ్ రఘురామ సెల్ ఫోన్ నుంచి మెసేజులు వస్తున్నాయని.. మరోవైపు అధికారులు తన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారని రఘురామ.. ఫోన్ ఇచ్చేశారని రఘురామ తనయుడు.. సెల్ ఫోన్ గురించి దర్యాప్తు సమయంలో చెప్పే అధికారం ఉందని న్యాయవాదులు చెప్పడంతో.. అసలు రఘురామ సెల్ ఫోన్ ఎక్కడుంది అనేది తెలియాలంటే సీఐడీ నోరు విప్పాల్సిందే..!

author avatar
Muraliak

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk

YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్

sharma somaraju

BJP: బీజేపీ కీలక సమావేశానికి ఆ సీనియర్ నేతలు డుమ్మా..

sharma somaraju