NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

MP RRR Case: RRR కేసులో ఆ ఒక్క తప్పు లేకపోతే వైసీపీనే పైచేయి అయ్యేది..!!

RRR Case in Supreme Court: Medical Report details

MP RRR Case: RRR కేసులో సుప్రీమ్ కోర్టు తీవ్రంగా స్పందించింది.. ప్రభుత్వాన్ని తప్పు పట్టింది.. ప్రభుత్వం తరపు వాదనలను తోసిపుచ్చింది.. ఆయనకు పూర్తి మద్దతుగా నిలిచింది.. ఇది ఏపీ ప్రభుత్వానికి ఒక పెద్ద ఎదురు దెబ్బ..! ఊహించని షాక్.. ఒకేరోజున అటు సుప్రీమ్ కోర్టు నుండి, ఇటు ఏపీ హైకోర్టు నుండి కూడా వ్యతిరేక తీర్పులు రావడం జగన్ ప్రభుత్వానికి ఏమాత్రం రుచించడం లేదు.. అయితే దీనిలో ప్రభుత్వం తప్పుగా వ్యవహరించిందా..!? రఘురామ అతి చేసారా..!? కోర్టుల్లో ప్రభుత్వం తరపు వాదనలు సక్రమంగా జరగలేదా..!? అనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. జరిగిన విషయం మొత్తలో ఓ సారి సూక్ష్మంగా పరిశీలిస్తే ప్రభుత్వం చేసిన ఓ తప్పు కేసుని రఘురామా వైపు తిరిగేలా చేసింది. పోలీసులు చేసిన ఆ అత్యుత్సాహం కేసుని అటు తిప్పేసింది..!

MP RRR Case: Government big mistake in RRR Case
MP RRR Case Government big mistake in RRR Case

MP RRR Case:  మెడికల్ రిపోర్ట్ పై గందరగోళం..!?

రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో ప్రభుత్వం వేసిన మొదటి అడుగు ఆయన పుట్టిన రోజున అరెస్టు చేయడం. అక్కడే ఆయనపై సానుభూతి పెరిగింది. పుట్టిన రోజూ అని కూడా చూడకుండా అరెస్టు చేసి.. హైదరాబాద్ నుండి గుంటూరు తరలించారు. గుంటూరు తరలించిన తర్వాత రాత్రి కష్టడీలోకి తీసుకున్నారు. ఈ కష్టడీలోనే కొట్టారు అనేది రఘురామా ఆరోపణ. సాధారణంగా ఇది రాజకీయ కేసు. ఆయన ఓ ఎంపీ. కచ్చితంగా వివాదాస్పదం అవుతుంది. కచ్చితంగా జాతీయ స్థాయిలో వివాదం అవుతుంది అని ముందే ఊహించి ఉండాలి. ముందే ఒక ఊహకు వచ్చి, పరిష్కారాలు, వాదనలు సిద్ధం చేసుకుని ప్లాన్ అమలు చేయాలి. కానీ అదేమి లేకుండా విచారణలో చేయాల్సింది చేశారు. ఆ తర్వాత మెడికల్ రిపోర్ట్ విషయంలోనే తప్పు బయటపడింది. ఇక్కడితో సుప్రీమ్ లోనూ.. ఇటు హైకోర్టులోనూ అనుమానాలు ఎక్కువయ్యాయి.. మెడికల్ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ ఎవరు..!? రిపోర్ట్ ని కోర్టు చెప్పినట్టు రమేష్ ఆసుపత్రికి లేదా కోర్టుకి పంపించకుండా జైలుకి ఎందుకు పంపించారు..!? మధ్యాహ్నం 12 గంటలకు రిపోర్ట్ రెడీ అయినా.. సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు రిపోర్ట్ కోర్టుకి ఇవ్వలేదు..!? ఇవే .. ఈ దశలోనే ప్రభుత్వంలో కొన్ని ఆధార సహిత అనుమానాలు బలపడ్డాయి. బయటపడ్డాయి.

MP RRR Case: Government big mistake in RRR Case
MP RRR Case Government big mistake in RRR Case

సైలెంట్ గా వ్యవహారాన్ని చక్కబెట్టలేరా..!?

రాజకీయం అంటే ప్రతిపక్షాలపై కక్ష సాధింపు, కేసులు, అరెస్టులు సహజమే.. కానీ ప్రతీదీ వివాదాస్పదంగా డీల్ చేస్తుండటమే ఇక్కడ వైసిపి చేస్తున్న అతి పెద్ద తప్పు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద కేసులు పెట్టారు. పెద్ద పెద్ద అరెస్టులు చేయించారు. కానీ ఏదో వివాదాస్పదం కాలేదు. పోలీసుల ద్వారా, కోర్టుల ద్వారా మొత్తం వ్యవహారాన్ని నడిపించేవారు. చట్టంలో లొసుగులు వాడుకుని.. తాను సేఫ్ గా ఉంటూ.., తన ప్రత్యర్థులను ఇరికించేవారు. కోర్టులకు వెళ్లిన పక్కాగా వాదనలు ఉండేవి. కొన్ని చీకటి మేనేజ్మెంట్లు ఉండేవి. ఇప్పుడు వైసిపిలో ఇవి చేతకావడం లేదు. గత ఏడాది డాక్టర్ సుధాకర్ కేసుని ఎంతగా కాంప్లికేట్ చేశారో.. దీన్ని కూడా లాగే డీల్ చేశారు. చట్టానికి లోబడి.. చట్టంలో లోపాలను అనుసరించి ఈ రఘురామా కేసుని డీల్ చేస్తే ఈజీగా మూడు నెలలైనా లోపల ఉంచే ప్లాన్ వేయొచ్చు. సైలెంట్ గా చక్కబెట్టాల్సిన వ్యవహారాన్ని వైలెంట్ చేసి.. ఓడిన వైసిపి ప్రభుత్వం ఈ కేసులో ఒక రకంగా తప్పుకి దొరికినట్టే.. అందుకే అనుభవం అనుభవమే అంటారు..

author avatar
Srinivas Manem

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju