NewsOrbit
Featured రాజ‌కీయాలు

MP RRR Case: రెబల్ ఎంపీ కేసు – జగన్ అసలు టార్గెట్ వాళ్ళే..!?

MP RaghuramakrishnamRaju: What Happens if Police beats him..?

MP RRR Case: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్టు వ్యవహారం ఏపీలో నలుగుతూనే ఉంది.. అనేక మలుపులు తిరుగుతుంది. నిజానికి ప్రభుత్వానికి అతనో తాల్లో పేనులా.. చెప్పులో రాయిలా తయారయ్యారు.. రోజు లైవ్ పెట్టడం.. రచ్చబండ పేరిట ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడడం.. సీఎంనీ వైసీపీ నేతల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.. ఆయన కోసం ఎప్పటి నుండో కాసుకొని కూర్చున్న ఏపీ పోలీసులకు నిన్న ఆయన చిక్కారు. అయితే తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే.. అసలు టార్గెట్ ఈ ఎంపీ కాదని.. ఆ పెద్దలు వేరే ఉన్నారని తెలుస్తుంది. ఈ రోజు నమోదైన ప్రాధమిక విచారణ రిపోర్ట్.., చేర్చిన అంశాలు పరిశీలిస్తే రెండు పెద్ద తిమింగలాలు కోసం ఈ గాలం వేసినట్టు చెప్పుకోవచ్చు..

MP RRR Case: Main Target fixed in Rebal MP case
MP RRR Case Main Target fixed in Rebal MP case

MP RRR Case: ఆ రెండు ఛానెళ్లపై పెద్ద కేసులే..!!

కులం, మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడం.., సీఎం స్థాయి వ్యక్తిని ప్రతిష్ట దిగజార్చేలా మాట్లాడడం.. వంటి యావజ్జీవ శిక్షలు పడే అవకాశాలున్న సెక్షన్లు కింద రఘురామపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఏ వన్ రఘురామ కానీ.., ఏ టూ టీవీ 5 ఛానెల్.., ఏ 3 ఏబీఎన్ ఛానెల్ ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు ఛానెళ్ల విషయంలో ఏపీ సీఎం జగన్ ఓ కంట కనిపెడుతూ ఉన్నారు. తాజాగా రఘురామా అరెస్టు ద్వారా అతనికి స్క్రిప్ట్ ఇస్తున్నది.. మొత్తం మాట్లాడిస్తున్నది.. రోజూ అతని కోసం కొంత టైం స్లాట్ కేటాయిస్తున్నది ఈ రెండు చానెళ్లు అనీ పోలీసులు నిర్ధారించారు. అందుకే ఆ రెండు ఛానెళ్లపై కేసులు నమోదు చేశారు. ఇవే సెక్షన్లు కింద.., ఇవే నేరారోపణపై ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 యజమానిని లేదా ఆ లైవ్ స్లాట్లు చేసే కీలక వ్యాఖ్యాత మూర్తిని అరెస్టు చేసే ప్రయత్నాలు జరగవచ్చు. మొత్తానికి ఈ ఎంపీ కేసులో ఆ రెండు చానెళ్లను టార్గెట్ చేసి.. వారిని పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కించడం కొంచెం సులువయింది.

MP RRR Case: Main Target fixed in Rebal MP case
MP RRR Case Main Target fixed in Rebal MP case

బీజేపీ సినిమా చూస్తుందా..!?

ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ పాత్ర ఏముంది..? అనేది కాస్త తేలాల్సి ఉంది. రఘురామకృష్ణం రాజు చిన్న వ్యక్తి కాదు. ఈ ఏడాదిగా ఆయన చిల్లరగా మాట్లాడుతూ కాస్త కొందరిలో చిన్నబోయారేమో కానీ ఆయన ఓ పెద్ద పారిశ్రామికవేత్త. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. మొదటిసారి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం స్థాయిలో కొన్నివిభాగాల్లో కీలకంగా పని చేశారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వ్యాపారవేత్త చాముండేశ్వరి, సినీ హీరో నాగార్జున, బీజేపీ కీలక నేతలతో కూడా రఘురామకి వ్యాపార సంబంధాలున్నాయి. అందుకే ఈ ఎంపీ అరెస్టు వ్యవహారంలో బీజేపీ వైఖరి ఏమిటి..!? రాజకీయ బలంతో బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందా..!? లేదా సినిమా చూస్తుందా..!? అనేది కీలక అంశంగా మారింది..!

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk