(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ములుగు ఎమ్మెల్యే సీతక్క మరో ట్వీట్ చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్ అతలాకుతలం అవుతుంటే కేసీఆర్ సారూ ఎక్కడున్నారు? ఒక్క కాలనీ లో గానీ, గ్రామంలో గానీ పర్యటించారా అని ట్విట్టర్ వేదికగా నిలదీసిన సీతక్క ఇప్పుడు ఫామ్ హౌస్ నుండి బయటకు రావద్దు అంటూ విజ్ఞప్తి చేశారు.
వర్షాల కారణంగా హైదరాబాద్ లో రహదారులపై నీరు చేరుకోవడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ లు అవుతూ వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళితే 60 కిలోమీటర్లు సీఎం కాన్వాయ్ వల్ల వాహన చోదకులు ట్రాఫిక్ నిలిచి పోవడంతో మరింత ఇబ్బందులు పడతారు అన్నట్లుగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. దీనికి సీఎం కాన్వాయ్ కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ నిలుపుదల చేసిన వీడియోను జత చేశారు సీతక్క.