NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

కొత్త రకం కరోనా గురించి డబ్ల్యూహెచ్వో ఒక గుడ్ న్యూస్… ఒక బ్యాడ్ న్యూస్..!

కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటి సారి బయటపడ్డ ఈ వైరస్ ఎన్నో దేశాలను కలవర పెడుతోంది. ఇక వ్యాక్సిన్ రేపో మాపో భారత్ లోనికి కూడా ప్రవేశిస్తుంది. ఒక మూడు నెలల్లో అందరూ టీకాలు వేయించుకుంటారు అని అనుకుంటున్న తరుణంలో ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి..

ఇప్పటిది కాదు….

ఇక ఈ కొత్తరకం కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) లో చీఫ్ సైంటిస్ట్ అయిన డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఒక పిడుగు లాంటి వార్త చెప్పారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సౌమ్య స్వామినాథన్ కరోనా వైరస్ ఇప్పటికే ఎన్నో దేశాల్లో ప్రవేశించి ఉంటుందని చెప్పడం గమనార్హం. బ్రిటన్ లో అన్ని కేసులు నమోదు అవుతున్నాయి అంటే కచ్చితంగా బయట దేశాలకు ఇది ఎప్పుడో వెళ్లి ఉంటుందని… అయితే బయటపడేందుకు సమయం పడుతుంది అన్నట్లు ఆమె వ్యాఖ్యానించారు.

ఇలా అయితే మేలే ….

అయితే ఇలాంటి సమయంలో కూడా ఆమె ఒక మంచి వార్త చెప్పడం జరిగింది. ప్రస్తుతం తయారుచేయబడుతున్న కోవిడ్ వ్యాక్సిన్ లు ఈ కొత్తరకం వైరస్ కంట్రోల్ చేయగలరు అని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక ఈ కొత్తరకం వైరస్ ఇప్పుడు వచ్చిన వ్యాక్సిన్ లకు అంతుచిక్కని విధంగా అయితే లేనట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె అన్నారు. అయితే ఒకపక్క ఏమో దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది అన్నట్టు మాట్లాడుతూ మరొక పక్క టీకాల తో నయం అయిపోతుంది అని చెబుతున్న సౌమ్య స్వామినాథన్ మాటలు ఎన్నో సందేహాలకు దారితీశాయి.

డబ్ల్యూహెచ్వో కి మాత్రం తిట్లు తప్పలేదు…

ఇక చీఫ్ సైంటిస్ట్ మాటలతో ప్రతి ఒక్కరూ ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద విరుచుకు పడుతున్నారు. ఈ వైరస్ను ఆదిలోనే తుంచి వేయకుండా చైనా కు సపోర్ట్ గా వ్యవహరిస్తూ ఇంతదూరం తీసుకొని వచ్చారని మండిపడుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ వైరస్ అన్ని దేశాలలో పాకింది కానీ టీకాతో నయం చేయవచ్చు అని కబుర్లు చెబుతున్నారని…. విపరీతంగా తిట్టిపోస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతానికైతే మరీ ఎక్కువ దేశాలు ఈ కొత్త వైరస్ కేసుల గురించి బయటకు వెల్లడించలేదు కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?