NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

నేను వస్తే సమస్యలు మాయం – జగన్

Share

శ్రీకాకుళం. డిసెంబర్ 30 : ఈ నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 63,657 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నారు, అంచనాలు పెంచి నిధులు మింగేయడం తప్ప..మీరుగా ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు అయినా ఉందా అని తెదేపా ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 333వ రోజు, ఆదివారం పలాస నియోజకవర్గంలోని ఉండ్రుకుడియా జంక్షన్‌ నుండి వెంకటాపురం, మహాదేవిపురం క్రాస్‌రోడ్, గరుడకండి, పలాస , కాశీ బుగ్గ పట్టణం మీదుగా పాదయాత్ర సాగింది. పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఆరోగ్య మిత్ర సిబ్బంది తమకు ఏ విధమైన సదుపాయాలు ప్రభుత్వం కల్పించడం లేదని, తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు.  ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వైఎస్‌ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారు, ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఆరోగ్య శ్రీ వైద్యసేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైకాపా అధికారంలోకి రాగానే అందరి కష్టాలు తీరిపోతాయి అని జగన్ అన్నారు.

 


Share

Related posts

మీరైతే ఎంత దానం చేస్తారు?

Kamesh

ఆ నివేదికలు బయటపెట్టండి

Kamesh

నియంతలకూ తప్పదు పరాభవం

somaraju sharma

Leave a Comment