మళ్ళీ తడబడ్డారు

అమరావతి: మంత్రి నారా లోకేష్ మరోసారి తడబడ్డారు. ఎన్నికల పోలింగ్ తేదీని తప్పుగా ప్రకటించారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి బరిలో నిలిచిన లోకేశ్‌ గురువారం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలో అక్కడున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. ఏప్రిల్‌ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయనీ, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. వెంటనే పక్కన ఉన్నవారు ఎన్నికలు తొమ్మిదో తేదీన కాదు, పదకొండున అని చెప్పగా లోకేష్ తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.

లోకేష్ చేసిన ఈ తప్పుడు ప్రకటన పట్ల వైసిపి, జనసేన నాయకులు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో లోకేష్ వీడియో పోస్ట్ చేసి సెటైర్లు వేస్తున్నారు.

మంగళగిరి వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ట్విట్టర్‌లో సెటైర్ వేశారు. ‘నారా లోకేశ్‌ గారి అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి’ అని ట్వీట్ చేశారు.