NewsOrbit
రాజ‌కీయాలు

జగన్ ఏడాది పరిపాలనపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన నారా లోకేష్..!!

రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పరిపాలన చేస్తున్నారని జగన్ ఏడాది పరిపాలనపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రంలో మద్యం నియంత్రణ చేపడతాం అని మాట ఇచ్చిన జగన్ రెడ్డి పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, చీప్ లిక్కర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా జగన్ మారాడు అంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం పెట్టి జగన్ ఏడాది పరిపాలన గురించి ఓ నివేదిక రూపంలో తెలుగుదేశం చార్జిషీట్ తయారుచేసింది. ఒకో విషయం గురించి నారా లోకేష్ మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని పెట్టుకొని వైయస్ జగన్ లక్ష కోట్లు దోచేశారు అని రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోంది అంటూ ఫైర్ అయ్యారు. జగన్ తన సొంత ఖజానా నింపుకోవడం కోసం సరికొత్త స్కామ్స్ తెర పైకి తీసుకువస్తున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. 

TRS, YSRCP trying to malign TDP, says Nara Lokesh - Politics News

పేదవారిని ఏడిపిస్తూ సంబరాలు చేసుకుంటున్న ప్రభుత్వం…

రాష్ట్రంలో పనులు లేకుండా పేదవాడు అల్లాడుతుంటే మరోపక్క వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు వైయస్ జగన్ రెడ్డి తాడేపల్లి నివాసం వద్ద సంబరాలు చేసుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. జగన్ ఏడాది పరిపాలనలో రాష్ట్రంలో ఒక్క పని జరగలేదని తెలిపారు. జగన్ పెద్ద గన్నేరు పప్పు అంటూ లోకేష్ సెటైర్ వేశారు. అసలు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరని చెప్పుకొచ్చారు. జగన్ సీఎం అయ్యాక పండగలు జరిగిన పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదని నారా లోకేష్ తెలిపారు. పనితీరు మార్చుకోవాలని, అరాచకాలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, అధికారులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.

 

రైతులను మోసం చేసిన ప్రభుత్వం….

ఇంకా వ్యవసాయం గురించి మాట్లాడుతూ జగన్ ఏడాది పరిపాలనలో 564 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, కనీసం రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రైతు భరోసా కింద 30 వేల కోట్లు దోచేసుకున్నారని జగన్ ప్రభుత్వం రైతు దగా ప్రభుత్వం అని విమర్శించారు. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిఏడాదిలో 7 లక్షల పింఛన్లు తొలగించి పేదలు, వృద్ధులను రోడ్డున పడేశారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో 45 ఏళ్లు దాటిన మహిళలకు పింఛన్ ఇస్తానని ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు.

Minister Nara Lokesh comments on TDP leaders who joined YSRCP

దళితులపై దాడులు…

మహిళలను మోసం చేస్తూనే మరోపక్క దళితులపై దాడి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైందని ఒక వైద్యుడిగా మాస్కు అడిగిన డాక్టర్ సుధాకర్ ని మానసిక రోగిగా పిచ్చివాడిగా జగన్ ప్రభుత్వం చిత్రీకరించింది అని విమర్శించారు. ఇదే సమయంలో అవినీతిని  ప్రశ్నించిన డాక్టర్ అనిత రాణి పై వైసీపీ నేతలు వేధింపులకు గురి చేయటం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో హోంమంత్రిగా మహిళా ఉంటున్న రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని విమర్శలు చేశారు. 

న్యాయస్థానంలో మొట్టికాయలు….

కొన్ని వేల కోట్లు రంగుల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. కోర్టు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిన జగన్ వైఖరిలో మార్పు రాలేదని జగన్ రెడ్డి మతం విధ్వంసం, ఆయన కులం కక్షసాధింపు కులమని… ప్రజా వేదిక కూల్చివేత జగన్ రెడ్డి విద్వాంసులకు శ్రీకారం చుట్టారని సొంత బాబాయ్ హత్య కేసు గురైన జగన్ ఎందుకు సిబిఐ విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రానికి కీలక ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని నిలిపివేశారని విమర్శించారు. అలాగే తెలుగుదేశం పార్టీకి ఇప్పటివరకు చేసిన ఆరోపణలను నిరూపించలేక పోయిన జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏడాది లో ఒక్క పెట్టుబడి కూడా రాష్ట్రానికి రాలేదు…

జగన్ ఏడాది పరిపాలనలో రాష్ట్రంలో ఒక పెట్టుబడి రాలేదని, పరిశ్రమలు లేవని అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇంటర్నేషనల్ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయని చెప్పుకొచ్చారు. అదే విధంగా తెలుగు భాష పై జగన్ కి గౌరవం లేదని విమర్శించారు. నేను ట్వీట్ పెడితేనే వైసీపీ వణుకుతోంది, ఇక ఫీల్డ్ లోకి వస్తే తట్టుకోలేరని నారా లోకేష్ హైలెట్ డైలాగ్ లు వేశారు. అంతేకాకుండా ఏ విషయంలో అయినా చర్చకు రమ్మంటే ఎలాంటి సెంటర్ ప్లేస్ అయినా నేను రెడీ జగన్ రెడీనా అంటూ లోకేష్ మీడియా సమావేశంలో చాలా హుషారుగా మాట్లాడారు. కరోనా వైరస్ లాంటి కీలక టైంలో వైసీపీ నాయకులు చేసిన అత్యుత్సాహానికి జాతీయ మీడియా వైసీపీ పార్టీ నేతలకు కోవిడ్ ఇడియట్స్ అని పేరు పెట్టింది అని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ప్రజల తరఫున తెలుగుదేశం పోరాడుతుందని 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ రాణిస్తోందని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. 

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk

YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్

sharma somaraju