NewsOrbit
రాజ‌కీయాలు

సోము ఇలా.. సంజయ్ అలా..! బీజేపీలో గందరగోళం..!!

national party bjp different ways in ap and telangana

దక్షిణాదిలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దృష్టి సారించిందనే విషయం తెలిసిందే. పార్టీని బలోపేతం చేయడం, సమర్ధ నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం ఇందులో భాగం. తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణలో ఆయన మార్కు చూపిస్తున్నారు. ఏపీలో ఇటివలే సోము వీర్రాజుకు పగ్గాలు అప్పజెప్పింది బీజేపీ అధిష్టానం. అందుకు తగ్గట్టే సంచలన నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. అయితే.. బీజేపీ జాతీయపార్టీ కావడంతో అన్నిచోట్లా ఒకేలా ఉండాల్సిన నిర్ణయాలు ఒకేలా ఉండటం లేదు. ఇందుకు వినాయకచవితి పండుగ నిదర్శనంగా నిలుస్తోంది.

national party bjp different ways in ap and telangana
national party bjp different ways in ap and telangana

తెలంగాణలో ఒకలా.. ఏపీలో ఒకలా..

తెలంగాణలో బీజేపీ అధికార పార్టీపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ముందుకెళ్తోంది. మొదటినుంచీ బీజేపీ తెలంగాణలో ఇదే పద్దతి అవలంభిస్తోంది. ఇప్పుడు గణేశ్ చతుర్ది విషయంలో మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతోంది. వినాయకచవితి ఉత్సవాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. రంజాన్ మాసంలో ఇచ్చినట్టే మినహాయింపులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. కేసీఆర్ నిర్ణయాలను కూడా తప్పు బట్టారు. అయితే.. ఏపీలో మాత్రం అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వంపై మరీ అంత ఒత్తిడి తీసుకురాలేదు. మండపానికి, వినాయక నిమజ్జనానికి ఒక రోజు మినహాయింపు ఇవ్వాలని కోరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు విమర్శలు చేస్తూ డిమాండ్ చేస్తే.. ఏపీ అధ్యక్షుడు సానుకూలంగా కోరడం రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది.

జాతీయపార్టీ బీజేపీ.. రాష్ట్రాల్లో ఇలా..

రెండు రాష్ట్రొల్లో రాజకీయ ప్రాముఖ్యం వేరు. కానీ.. వినాయకచవితి పండగ నిర్వహణ ఎక్కడైనా ఒకటే. భక్తుల మనోభావాలు ఒక్కటే. అయినా.. తెలంగాణలో ఒక విధంగా, ఏపీలో మరో విధంగా రెండు రాష్ట్రాల అధ్యక్షులు కోరారు. ఇందుకు రాజకీయపరమైన కారణాలు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుంది. ఏపీలో అధికార పార్టీతో కంటే టీడీపీతో బీజేపీకి ఎక్కువ పోరు నడుస్తుంది. దీంతో రెండు రాష్ట్రాల ప్రాధామ్యాలు వేరు అంటున్నారు. అయితే.. ఈ విషయంలోనే బీజేపీ సిద్ధాంతాలు వేరని చెప్పటానికి లేదు. ఏపీలో ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై బీజేపీ యుద్ధం చేయకపోయినా.. 2024లో జనసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు కలిసి పనిచేస్తున్నామని ధీమాగా చెప్తున్నారు సోము వీర్రాజు.

author avatar
Muraliak

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju