30.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ ఒక్క విషయంలో జగన్ సర్కార్ పై నెగిటివిటీ..!!

Share

జగన్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక చాలా విమర్శలు ప్రతిపక్షాలు నుండి వచ్చాయి. ఒక ఆర్థిక ఉగ్రవాది, ఫ్యాక్షనిస్ట్ కి ప్రజలు పట్టం కట్టారు అంటూ 2019 ఎన్నికల ఫలితాలపై జగన్ ప్రత్యర్థులు చేసిన కామెంట్లు. ఇదే క్రమంలో మొట్టమొదటి సారి ఇలాంటి అనుభవం లేకుండా సీఎం సీట్లో కూర్చోటంతో జగన్ ఏ విధంగా పరిపాలిస్తారు అన్నదానిపై ప్రతి ఒక్కరికి అనేక సందేహాలు, అపోహలు ఏర్పడ్డాయి. కానీ జగన్ ఎప్పుడైతే సీఎం అయ్యారో ఆయన తీసుకున్న నిర్ణయాలు తలపండిన రాజకీయ నేతలను ప్రభావితం చేస్తున్నాయి. అంతే కాకుండా ప్రముఖ పేరుగాంచిన సర్వేలలో కూడా జగన్ కి కేవలం 18 నెలల పరిపాలన కి టాప్ ఫైవ్ లో మొదటినుండి ఉండటం జరిగింది.

23 L to get Rs 18,750 a year for 4 yrs- The New Indian Expressఇదే క్రమంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు కూడా జగన్ కి జేజేలు కొడుతున్నారు. మరోపక్క గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని జైలుకి పంపిస్తూ జగన్ పాలన చేస్తున్నారు. సీఎం అయిన నాటి నుండి మొన్నటి వరకు పాలనాపరంగా అంతా బాగానే ఉన్నా కానీ.. ఇటీవల ట్రాఫిక్ రూల్స్ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాల విషయంలో పబ్లిక్ లో నెగిటివిటీ బాగా పెరిగిపోయింది.

 

అసలే కరోనా కష్టకాలంలో ఉద్యోగాలు లేని సమయంలో ఈ విధంగా ఫైన్ లు వెయ్యడం ఏంటి అని ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇంత భారీ స్థాయిలో జరిమానాల విధింపు ఏమాత్రం సమంజసం కాదని అంటున్నారు. పైగా సరైన రోడ్లు సిగ్నల్ వ్యవస్థ లేకుండా ఈ విధంగా ట్రాఫిక్ రూల్స్ విషయంలో జరిమానాలు విధించడం కరెక్ట్ కాదని పబ్లిక్ జగన్ ప్రభుత్వం పై మండిపడుతున్నారు. మరోపక్క విపక్షాలు కూడా ఈ విషయంపై భగ్గుమంటున్నాయి.


Share

Related posts

తెలంగాణ మారినట్టేనా..! బీజేపీకి ఇది బలమా..? వాపా…!?

Muraliak

‘వివేకా కేసు సిబిఐకి ఇవ్వాలి’

somaraju sharma

Divya Ganesh Beautiful Photos

Gallery Desk