ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nellore Court Case: సీబీఐ విచారణ తప్పేలా లేదు..!? కోర్టులో చోరీ- పెద్ద ట్విస్ట్..!

Share

Nellore Court Case: నెల్లూరు కోర్టులో ఇటీవల చోరి జరిగిన విషయం తెలిసిందే. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెట్టిన కేసుకు సంభందించిన ఆధారాలు చోరీకి గురి అయ్యాయి. చోరీ ఎవరు చేసారో..? ఎందుకు చేసారో..? అనే విషయాలు పోలీసులు మీడియా కు చెప్పారు. నిందితులను అరెస్ట్ చూపి, చోరీ కి గురి అయిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగలు కావాలని కేసు ఆధారాలు చోరి చేయలేదు అని పోలీసులు చెప్పారు. అయితే పోలీసులు సక్రమంగా విచారణ చేయలేదు అని హైకోర్టు లో ఓ పిటిషన్ దాఖలు అయింది. .!

Nellore Court Case: “న్యూస్ ఆర్బిట్” ముందే చెప్పింది..!

ఈ కేసుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుంది అనే విషయాలపై ‘న్యూస్ ఆర్బిట్ ‘ ఓ కధనం ఇవ్వడం జరిగింది. ఆ కధనం లో విశ్లేషణ చేసిన విధంగా నేడు అడుగు పడుతున్నాయి. నెల్లూరు కోర్టు చోరీ కేసులో దర్యాప్తు సరి అయిన దిశగా జరగడం లేదు. చేతి, పాద ముద్రలు కూడా సేకరించలేదు. స్వతంత్ర సంస్థ తో దర్యాప్తు చేయించాలని హైకోర్టు లో సుమోటో పిల్ దాఖలు కాగా.. కోర్టు పిటిషన్ ను విచారణ కు స్వీకరించింది. సీబీఐ డైరెక్టర్, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి లకు కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసును హైకోర్టు తీవ్రంగా పరిగణలోకి తీసుకోని సీబీఐ దర్యాప్తు నకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. అందుకే సీబీఐ కి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దిగువ కోర్టు లో జరిగిన చోరి పై హైకోర్టు సీరియస్ గా స్పందిస్తుంది. రాజకీయ వత్తిళ్ల కారణంగా పోలీసులు నీస్పక్ష పాతంగా దర్యాప్తును చేసే అవకాశాలు ఉండవు. అందుకే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని వ్యవస్థ తో దర్యాప్తునకు ఆదేశించే అవకాశాలు ఉంటాయి. ఇదే విషయాన్ని ‘న్యూస్ ఆర్బిట్’ చోరీ జరిగిన తొలి రోజుల్లోనే ప్రచురించడం జరిగింది.


Share

Related posts

Bigg Boss 5 Telugu: “సిరితో షణ్ముక్.. అలా అన్నప్పుడు నేను చాలా బాధపడ్డా”.. మానస్ సీరియస్ కామెంట్స్..!!

sekhar

NTR : ఎన్టీఆర్ 30 కి విలన్ గా విజయ్ సేతుపతి ని సెట్ చేసిన త్రివిక్రమ్ ..?

GRK

YSRCP: వైసీపీ ఎవరి చెవిలో “కమ్మ”ని పూలు పెడుతున్నట్టు..!?

Srinivas Manem
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar