NewsOrbit
రాజ‌కీయాలు

ఆంధ్ర రాజకీయాల్లో మరో సంచలనం…!

ఏదో మరో కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నట్టు… ఏదో రాజకీయ పండగ జరుగుతున్నట్టు… ఏదో ఓట్లు వాన కురవాలి అన్నట్టు… రాష్ట్రంలో రాజకీయం ఊపుమీదుంది. ఒక అంశం తర్వాత మరో అంశం… అది ముగిసే సమయానికి మరో అంశం తెరపైకి వస్తున్నాయి. మొన్న పోతిరెడ్డిపాడు, నిన్న డాక్టర్ సుధాకర్ అంశాలు ఉండగా… ఇప్పుడు తాజాగా రంగనాయకమ్మ అంశం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈమె ఎవరు? ఏం చేసింది..? ఈమె పై అపి సిఐడి ఎందుకు కేసు నమోదు చేసింది? ఉన్నట్టుండి ఈ పేరు తెరపైకి ఎందుకు వచ్చింది..? అనేది చూద్దాం పదండి.

ఎవరు? ఏం చేశారు…?

గుంటూరు కి చెందిన 66 ఏళ్ళ వృద్ధురాలు రంగనాయకమ్మ. స్వతహాగా టీడీపీ అభిమాని. ఆ వయసులోనూ సోషల్ మీడియాలో యాక్టీవ్. అదే ఈమె కొంప ముంచింది. ఈమె తరచూ చంద్రబాబుకి, టీడీపీ కి మద్దతుగా పేస్ బుక్ లో పోస్టింగులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే ఈ నెల 7 వ తేదీన విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై పెద్ద పోస్టింగు పెట్టారు. ప్రభుత్వ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ…? వైసిపి నాయకులను విమర్శిస్తూ.., జగన్ చేసిన సాయంపై వ్యాఖ్యలు చేస్తూ… ఒక పోస్టు పెట్టారు. ఇది సంచలనంగా మారింది. ఇది అలా ప్రభుత్వానికి చేరడంతో నిరాధార ఆరోపణలు చేసారని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసారని ఆరోపిస్తూ ఆమెపై ఐపీసీ 505 , 153 ఇలా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఏపీసీఐడీ ఆమెకు 41 ఏ నోటీసులు జారీచేశారు. ఆమెను టీడీపీ నాయకులూ పరామర్శించారు. ఆ పార్టీ నాయకుడు నారా లోకేష్ ట్విట్టర్ లో ఖండించారు.

సామాన్యుడే సమిధ…!

నర్సీపట్నం కి చెందిన వైద్యుడు సుధాకర్ రాజకీయ పావుగా మారారు. సస్పెండ్ అయ్యి పిచ్చోడిగా ముద్ర వేసుకున్నారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ ఇప్పుడు సమాజంలో ఒక పెద్ద మచ్చ వేసుకుని ఉన్నారు. అది రాష్ట్రంలో పెద్ద సంచలనంగా, రాజకీయ అంశంగా మారింది. ఆ విషయం అలా ఉండగానే ఇప్పుడు రంగనాయకమ్మ బుక్కయ్యారు. పాపం 66 ఏళ్ళ వయసులో ఏపీసీఐడి చుట్టూ తిరగాల్సి వస్తుంది. టీడీపీ నాయకులూ రెండు రోజులు పరామర్శిస్తారు, మళ్ళీ వేరే అంశం దొరుకుతుంది వెళ్ళిపోతారు. ఇక్కడ బుక్కయ్యింది, కోర్టుల చుట్టూ తిరగాల్సింది ఆమె, ఆమె కుటుంబమే. అది తెలుసుకోకుండా రాజకీయాల్లో పావుగా మారిపోయారు. రాజకీయ పావులుగా మారితే భవిష్యత్తు పావుగానే మిగులుతుంది తప్ప, పెద్ద ప్రయోజనాలు ఉండవు. ఇలా సుధాకర్ అంశం, రంగనాయకమ్మ అంశం పాఠాలుగా మారాయి.

author avatar
Srinivas Manem

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Leave a Comment