ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టడం అందరికీ తెలిసిందే. హైకోర్టు తీర్పు మేరకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో శుక్రవారమే పదవీ బాధ్యతలు చేపట్టినట్లు రమేష్ కుమార్ చెప్పుకొచ్చారు. ఎన్నికల సంఘం కార్యదర్శి వాణిమోహన్ ద్వారా తాను బాధ్యతలు చేపట్టినట్లు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు మరియు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు రమేష్ కుమార్ పేర్కొన్నారు.

ఇక పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టినట్లు విజయవాడలో కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని అన్నారు. గతంలో లాగా మళ్లీ ప్రభుత్వం కోపరేట్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు విని జనాలు, ఏపీ రాజకీయాల్లో చాలా మంది నవ్వుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన రాష్ట్రంలో ఆయన చేయటానికి ఏముంది?, స్థానిక ఎన్నికలు అనే అంశాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టి, రాజధానుల వ్యవహారం విషయంలో తలమునకలై ఉంది. ఇలాంటి టైం లో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనటం పట్ల చాలామంది ఆయన చేసిన వ్యాఖ్యలపై జోకులు వేసుకుంటున్నారు.
ముఖ్యంగా తనకు ప్రభుత్వం సహకరించాలని నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసే విషయంలో ప్రభుత్వంతో చర్చించకుండా సొంత నిర్ణయం తీసుకున్నారు. ఒక విధంగా రాజకీయంగా ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లుగా వ్యవహరించారు. ఆ తర్వాత పదవి కోల్పోయారు.
అయినా సరే టైం కలిసొచ్చి న్యాయస్థానాల్లో తీర్పు అనుకూలంగా రావడం వల్ల మళ్లీ పదవి చేపట్టారు. ఇలాంటి టైమ్ లో కూడా మళ్లీ ప్రభుత్వం సహకరించాలని, ఏదో ప్రభుత్వంపై బురద జల్లే విధంగా పరోక్ష వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదనే టాక్ ప్రజల లోనూ అటు రాజకీయాల్లోనూ బలంగా వినబడుతోంది.
రాజ్యాంగం బద్ధ పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా మెలిగితే ప్రజాస్వామ్యానికి బాగుంటుందని, అలా కాకుండా ఆ పదవుల్లో ఉంటూ రాజకీయ నాయకులతో రాజకీయాలు చేస్తే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయవాడ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.