NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Nimmagadda : నిమ్మగడ్డ “పవర్” ఎటువైపు..!? సజ్జలను తీసేస్తే.., బాబుని ఏం చేయాలి..!?

CM Jagan VS Nimmagadda ; What Will happen?

Nimmagadda Ramesh Kumar : ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తుతం అత్యంత బలీయమైన వ్యవస్థగా ఉన్నారు. Nimmagadda నిమ్మగడ్డకి రాజ్యాంగ బద్ధమైన పదవి.., రాజ్యాంగ బద్ధమైన హోదా పేరిట రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కంటే రెండాకులు ఎక్కువే వాడేసుకుంటున్నారు..! YS Jagan సీఎం జగన్ కీ.., Nimmagadda నిమ్మగడ్డకి ప్రస్తుతం వ్యక్తిగతంగా కూడా చెడింది. వ్యవస్థల పరంగా విభేదాలు, వ్యక్తిగత విభేదాలుగా మారాయి. సుప్రీం తీర్పుతో ఎన్నికల నిర్వహణకు పూనుకున్న Nimmagadda నిమ్మగడ్డ ఇప్పుడు తన పూర్తి పవర్ ని తీస్తున్నారు. ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు..!? ఇదే సందర్భంలో టీడీపీ/ చంద్రబాబు పట్ల ఆయన వైఖరి ఎలా ఉంటుంది..? అనే దానిపై ఆయన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది..!!

Nimmagadda Ramesh kumar Power Politics
Nimmagadda Ramesh kumar Power Politics

Nimmagadda : నిమ్మగడ్డ ఆగ్రహం.. అధికారులు/ నాయకులపై కత్తెరలు..!!

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తుతం కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ వైసీపీ వ్యవహారాలపై ఉన్నాయి. ప్రభుత్వ పాలనపై, నిర్ణయాలపై ఉన్నాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటున్నా.. దాన్ని నిమ్మగడ్డ క్షుణ్ణంగా చూస్తున్నారు. వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నా.., వాటిని నిమ్మగడ్డ స్పష్టంగా వింటున్నారు. దీనిలో భాగంగానే తనకు నచ్చని వారిపై కత్తి కడుతున్నారు. ఇద్దరు ఐఏఎస్ లను “అభిశంసన” చేయాలి అంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అది వివాదంగా మారి ఎటూ తేలకమునుపే.., “ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ పదవి నుండి తొలగించాలి” అంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇది ప్రభుత్వం అమలు చేస్తుందో.., లేదో తేలక మునుపే “ప్రభుత్వం ఇచ్చే కుల ధ్రువీకరణ పత్రాలపై సీఎం జగన్ ఫోటో ఉండకూడదు” అంటూ ఆదేశాలిచ్చారు. ఇలా చక చక ఆదేశాలు ఇస్తూ వైసీపీ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారు. సరే.., ఆయనకు ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అధికారం అనుకుందాం..!

TDP Chandrababu manifesto
TDP Chandrababu manifesto

TDP మ్యానిఫెస్టో ఇవ్వవచ్చా..!?

తెలుగు దేశం పార్టీ కొత్త సంస్కృతిని తీసుకొచ్చింది. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. కేవలం గ్రామాల్లోని పార్టీలు ఆ పోటీలో నిల్చున్న అభ్యర్థులకు బయటి నుండి మద్దతుగా మాత్రమే నిలబడతాయి. ఈ విషయం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంటే.., 45 ఏళ్ళ రాజకీయ అనుభవమున్న చంద్రబాబు కంటే ఇంకా ఎవరికీ బాగా తెలియదు..! అటువంటి గ్రామా పంచాయతీ ఎన్నికలకు చంద్రబాబు నిన్న మ్యానిఫెస్టో ప్రకటించారు. అంటే ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరించారు. “గ్రామా పంచాయతీ ఎన్నికలకు ఒక రాజకీయ పార్టీ ఇవ్వవచ్చా..? అనే సందేహం అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి వచ్చిందో లేదో..!? ప్రభుత్వం చేస్తున్న ప్రతీ అంశంపై.., వైసీపీ చేస్తున్న ప్రతీ విషయంపై నిఘా పెట్టి.., వెంటనే అడ్డుకుంటున్న నిమ్మగడ్డ.. టీడీపీ విషయంలో మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఇది పెద్దగా ఆశ్చర్యం అవసరం లేదు..!

Nimmagadda : ఇక కక్ష సాధింపు మొదలు పెట్టినట్టేనా..!?

ఎవరు ఎన్ని చెప్పినా.., నిమ్మగడ్డ రమేష్ కుమారు లక్ష సార్లు ప్రెస్ మీట్ పెట్టి “మేము రాజకీయాలకు అతీతం, నిస్పక్షపాతంగా వ్యవహరిస్తాం, రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తాం” అని చెప్పుకున్నప్పటికీ.. ఆయన కూడా ఒక మనిషే.. ఒక మనిషి అన్నాకా “కోపాలు, కక్షలు, కుట్రలు, వ్యక్తిగత అంశాలు, ప్రతిష్టలు ఉంటాయి”..! సో.., నిమ్మగడ్డ రమేష్ కుమార్ లో ఇవి లేవు అనడానికి అవకాశం లేదు. ఇవన్నీ ఉన్నట్టే చెప్పుకోవాలి.

Nimmagadda Ramesh VS YS Jagan
Nimmagadda Ramesh VS YS Jagan

* తనను కులం పేరుతో టార్గెట్ చేసిన సీఎం జగన్ పై.., అత్యవసర ఆర్డినెన్స్ ద్వారా తనను తొలగించిన సీఎం జగన్ పై.., తనను పదే పదే టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్న వైసీపీ నేతలపై.., తాను తీసుకుంటున్న నిర్ణయాలను పదే పదే తప్పు పడుతూ సోషల్ మీడియాలో బద్నామ్ చేస్తున్న వైసీపీపై … నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి కోపం, కక్ష, కుట్ర ఉండదు అనుకుంటే పొరపాటే..! అందుకే ఇప్పుడు ఆయన వ్యవహార శైలిలో ఏమాత్రం ఆశ్చర్యం అవసరం లేదు. తన టైం వచ్చింది. తన పవర్ చూపించాల్సిన తరుణం దొరికింది. (భీముడి చేతిలో గధ ఎన్నాళ్ళు ఉన్నా ఏం ఉపయోగం ఉండదు. యుద్ధంలో దిగి, ప్రత్యర్థిని కొడితేనే దాని ఉపయోగం.. అలా ఎన్నికల కమీషనర్ కుర్చీలో ఎన్నేళ్లు ఉన్నా ఉపయోగం ఉండదు. ఎన్నికలు జరుగుతున్నప్పుడే దానికి, ఆ పదవికి ఉపయోగం.!) సో నిమ్మగడ్డ ఇప్పుడు తన పవర్ చుపిస్తున్నట్టే చెప్పుకోవచ్చు.
కాకపోతే “రాజ్యాంగం హక్కులు, రాజ్యాంగ బద్ధమైన హోదా.., నిస్పక్షపాతంగా” అంటూ కలరింగులు ఇచ్చుకోవడమే సరిగ్గా లేదు.., ఒకవేళ ఆయన రాజ్యాంగ బద్ధమైన హక్కులు, అధికారాలు వాడుకుంటే..? నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే.. టీడీపీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోని..!? ఎలా సమర్దిస్తారో..!?

 

 

author avatar
Srinivas Manem

Related posts

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju