NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నో డౌట్ …నా పై దాడి యత్నం వెనక ఉన్నది చంద్రబాబే:బాపట్ల ఎంపీ సురేష్ బాబు

“ఇవాళ మిస్సయినా నిన్ను వదిలి పెట్టను”అని ఒక అధికార పార్టీ ఎంపీకి ఆయన స్వగ్రామంలోనూ అది ఆయన ఇంటి ఎదుటే ఒక సామాన్య వ్యక్తి హెచ్చరించిన సంఘటన చూస్తే ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది అద్దంలో కనిపిస్తుంది.బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ బాబుపై గురువారం రాత్రి జరిగిన దాడి యత్నం సంచలనంగా మారింది.

No doubt ... Chandrababu is behind the attempt to attack me: Bapatla MP Suresh Babu
No doubt Chandrababu is behind the attempt to attack me Bapatla MP Suresh Babu

ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడయిన సురేష్ బాబుపై ఇప్పటికే రెండు మూడు సార్లు దాడి ప్రయత్నాలు జరిగాయి .తాజాగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఎంపీ నివాసం వద్దే మందడం గ్రామానికి చెందిన బత్తుల పూర్ణచంద్రరావు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇంట్లో నుంచి ఆయన బయటకు ఎంపీ వాహనానికి బైక్ ను అడ్డుగా పెట్టాడు. అనంతరం రాడ్ తో దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు.దీంతో స్పందించిన గన్ మెన్లు వెంటనే స్పందించి నిందితుడ్ని అడ్డుకోవటంతో పెనుప్రమాదం తృటిలో తప్పింది. తదుపరి అతను పారిపోయి ఇదే గ్రామంలోని ఒక అమరావతి జేఏసీ నేత ఇంట్లో దాకొనగా పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనతో ఎంపీ కూడా షాక్ తిన్నట్లు కనిపించారు. పూర్ణచంద్రరావు ఇదే గ్రామానికి చెందిన వారైనప్పటికీ గత కొన్నేళ్లుగా మందడం గ్రామంలో ఉంటున్నాడని ఇప్పుడు అకస్మాత్తుగా ఊర్లోకి వచ్చి ఈ దాడికి ప్రయత్నిం చాడని సురేష్బాబు శుక్రవారం మీడియాకు చెప్పారు.

No doubt ... Chandrababu is behind the attempt to attack me: Bapatla MP Suresh Babu
No doubt Chandrababu is behind the attempt to attack me Bapatla MP Suresh Babu

ఈ దాడి వెనుక టిడిపి హస్తమే కాకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రోద్బలం ఉందనేది ఏ మాత్రం అనుమానం లేని విషయం అన్నారు. తన మీద దాడికి ప్రయత్నించిన పూర్ణచంద్రరావు ‘పోలీసులు పట్టుకుంటే గంటలో బయట కొస్తా… కోర్టుకి పంపిస్తే ఒక రోజులో వచ్చేస్తా..ఈ రోజు మిస్సయినా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు”అని సవాల్ విసిరి వెళ్లాడంటే అతని వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చునని ఎంపీ వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సామాజిక వర్గం వారు తప్ప మరొకరు ఉండకూడదన్న రీతిలో వారి వ్యవహారశైలి ఉందని ఇదే ప్రాంతానికి చెందిన దళితుడైన తాను ఎంపీ కావటం వారు జీర్ణించుకోలేక న్నారని అందుకే తనను టార్గెట్ చేస్తున్నారని సురేష్ బాబు చెప్పారు.ఒక ఎంపీకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుడు ఆ సామాజిక వర్గం చేతిలో విలవిల్లాడాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తాను ఇలాంటి బెదిరింపులకు, దాడులకు భయపడే రకం కాదని దేనికైనా సిద్ధంగానే ఉన్నానని ఎంపీ సురేష్ బాబు ఉద్ఘాటించారు.

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!