NewsOrbit
రాజ‌కీయాలు

No Salaries: తెలంగాణ ఖజానా కష్టాలు… జీతం కోసం ప్రభుత్వ ఉద్యోగులు పడిగాపులు..!!

No Salaries: రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. రెండు వారాలు అయినాగానీ జీతాలు ప్రభుత్వాలు చెల్లించకపోవడంతో.. ప్రభుత్వ ఉద్యోగస్తులు అనేక అవస్థలు పడుతున్నారు. ధనిక రాష్ట్రమని  చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదవ తారీకు దాటిన గాని జీతాలు ఆలస్యం కావడంతో ఉగాది పండుగ దృష్ట్యా మొదటి తారీఖున వస్తాయని భావించిన ఉద్యోగులకు.. ఇప్పటికి కూడా జీతాలు రాక పోవడంతో.. వారిలో ఆందోళన నెలకొంది. దీంతో ఎప్పుడూ ప్రభుత్వం జీతాలు ఎకౌంట్ లో వేస్తుందో అని తరచుగా సెల్ ఫోన్ మెసేజ్ లు చెక్ చేసుకుంటున్నారు. మరోపక్క ఆర్థిక శాఖ అధికారులు ఆర్బీఐ నుండి తీసుకున్న అప్పు వచ్చిన తర్వాతే జీతాలు చెల్లించే పరిస్థితి ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు.

Telangana Back To School From February!

ఈ పరిణామంతో మరో వారం రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ ఇయర్ ముగిసే సమయానికి.. తెలంగాణ ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులలో  తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత నెలలోనే దాదాపు 2.56 లక్షల కోట్ల బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. మొదటి ఫైనాన్షియల్ ఇయర్ లోనే జీతాలు చెల్లించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు గాను 14 జిల్లాల లోని ఉద్యోగులకు, టీచర్లకు మాత్రమే జీతాలు జమ కాగా మరో 19 జిల్లాలలో ఉన్న ఉద్యోగులకు జీతాలు అందకపోవటంతో .. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Telangana government staff to get hiked salaries from July | Hyderabad News - Times of India

దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా భారీ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత నెలలోనే ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి.. ఇంతగా ప్రభుత్వం ఇబ్బంది పడటంతో.. మిగతా నెలలో ఏ విధంగా ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంది అన్నది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరియు టీచర్లకు ప్రతి నెల జీతాలు చెల్లించడానికి రెండు వేల… కోట్లకు పైగా.. ఖర్చు పెట్టే.. పరిస్థితి ఉండటంతో పాటు పెన్షనర్లకు నెలకు 1400 కోట్లు ఖర్చు పెట్టనున్న క్రమంలో.. నెలకి జీతాలు.. పెన్షన్ల కోసం మొత్తం నాలుగు వేల కోట్లు అవుతున్నాయి. ఈ లెక్కన ఏడాదికి 48 వేల కోట్ల రూపాయలు.. జీతాలు పెన్షన్లు రూపంలో వెళ్ళి పోతున్నాయి. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత నెలలోనే ఈ విధంగా ఉంటే మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం జీతాలు  ఏవిధంగా ఇస్తుందన్నది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది.

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!

కేసీఆర్ జ‌గ‌న్‌కు హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టే.. వైసీపీలో ఏం జ‌రుగుతోంది…?

క‌దిరిలో ‘ టీడీపీ కందికుంట‌ ‘ కు బాల‌య్య ప్ల‌స్.. !