NTR as CM 1985 -1989: ఎన్టీఆర్ ఇందులో గొప్ప..!? పాలనలో పాపాలు – ఎన్టీఆర్ కి శాపాలు..! Part

Share

NTR as CM 1985 -1989: ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం.. 1983లో గెలవడం.. 1985లో భారీగా గెలవడం ముందు కథనంలో చెప్పుకున్నాం. ఈ కథనంలో 1989 లో ఎన్టీఆర్ ఎందుకు ఓడిపోయారో చెప్పుకుందాం.. ఎన్టీఆర్ యుగపురుషుడు.. ఆయన నటనలో తిరుగులేని రారాజు.. కానీ రాజకీయాల్లో మాత్రం అందరి లాంటి నాయకుడే. అందరి లాంటి పాలకుడే. అందుకే ఒక్క అయిదేళ్ల పాలనలోనే ప్రజలు అతన్ని తిరస్కరించారు. ఎన్టీఆర్ అంటే మనం ఇప్పటికీ బాగా చెప్పుకునేవి జనతా వస్త్రాలు, రెండు రూపాయలకే కిలో బియ్యం.., మూడంచెల వ్యవస్థ.. మహిళలకు ఆస్తిలో వాటా.. భేష్. ఎన్టీఆర్ అంటే ఇదే. ఆయన మాంచి నిర్ణయాలు తీసుకునే వారు. సీఎంగా ఆయన ఏది చెప్తే అది జరగాల్సిందే. అందుకే 1985లో సీఎం అయ్యాక.. 1987 వరకు తిరుగులేని పరిపాలన అందించారు. కానీ ఆయన కూడా ఒక మనిషే కదా..! ఆయనకు కుటుంబాలు, బంధుప్రీతి.., బలహీనతలు ఉంటాయి కదా.. ఇవే ఆయనకు ప్రజలను దూరం చేశాయి. ఘోరంగా ఓడిపోయేలా చేశాయి. ఎన్టీఆర్ అంటే ప్రజల్లో ఉన్న మంచి పేరుని పాడుచేశాయి. ఇవన్నీ ఎవరో ఆయనకు అంటగట్టారు అనుకుంటే పొరపాటే.. ఎన్టీఆర్ అంత అమాయకుడేమి కాదు..

Read it: ఎన్టీఆర్ ఇందులో గొప్ప..!? Part – 1 

NTR as CM 1985 -1989: What Makes NTR as Great Human..?

NTR as CM 1985 -1989:  పాలనలో చంద్రబాబు చీకటి నిర్ణయాలు..!

ఎన్టీఆర్ సీఎం.. చంద్రబాబు మంత్రి. ఇద్దరూ మామ అల్లుళ్ళు. 1985 లో ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించే సమయానికి చంద్రబాబు అంటే మంచి గురి ఉండేది. 1985 నాటి నాదెండ్ల భాస్కరరావు సంక్షోభంలో చంద్రబాబు మొత్తం వ్యవహారాన్ని నడిపించారని.. చంద్రబాబులో మాంచి రాజకీయ పరిణితి ఉందని గ్రహించిన ఎన్టీఆర్ అప్పటి నుండీ చంద్రబాబుని నెత్తిన పెట్టుకున్నారు. ఎన్టీఆర్ ఏమో పాలన, సంక్షేమం అంటూ ఉంటె… చంద్రబాబు మాత్రం చీకటి పనులు చక్కబెట్టే వారు. ఎన్టీఆర్ కి తెలియకుండా భూములను కట్టబెట్టడం.., రహస్య జీవోలు ఇప్పించడం.., పాలనలో వేలు పెట్టడం చేసేవారు. అలా 1989 వచ్చే సరికి ఎన్టీఆర్ కి తెలిసి కొంత, తెలియక కొంత అవినీతి సామ్రాజ్యంగా మారిపోయింది. అయితే అప్పటికే కాలం మించిపోయింది. ప్రజల్లో అసంతృప్తి వచ్చేసింది. పాలనలో డొల్లతనం బయటకు పాకింది. ప్రతిపక్షం బలపడింది. ఎన్టీఆర్ కూడా లక్ష్మీ పార్వతి వలలో చిక్కుకున్నారు. ఓ వైపు అనారోగ్యం.. మరోవైపు సొంత మంత్రుల వ్యవహారాలతో విసిగిన ఆయన ఒకేసారి 30 మంది మంత్రులను భర్తరఫ్ చేశారు. అదో సంచలనం. తాను అవినీతిని సహించబోను అనే సంకేతాన్ని ఇచ్చారు. కానీ.. అప్పుడే ఎంటర్ అయింది ఈనాడు.. అప్పటికే చంద్రబాబు ద్వారా కొంత లబ్ది పొందడం రుచి మరిగిన ఈనాడు రామోజీరావు.. ఇక ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా వార్తలు రాయడం మొదలు పెట్టారు.. అప్పట్లో ఉన్న సరైన దిన పత్రిక అదే కావడంతో ఎన్టీఆర్ అప్రతిష్ట మూటగట్టుకున్నారు..

Must Read : ఒక మందు వంద వార్తాలు.. ఏది నిజం..!? ఏది అబద్ధం..!? 

NTR as CM 1985 -1989: What Makes NTR as Great Human..?

ఎలా అసామాన్యుడు..? ఎలా అసాధారణుడు..!?

ఎన్టీఆర్ ఒక హీరో. ఎన్టీఆర్ ఒక బ్రాండ్. ఎన్టీఆర్ అంటే ఒక మొండి. ఆయన ఎదురుగా ఎవరైనా కాలు మీద కాలేసుకుని కూర్చున్నా.. సిగరెట్ కాల్చినా.. చిన్నవాలైతే చేతులు కట్టుకోకపోయినా సహించేవారు కాదు. కానీ ఇవన్నీ ఆయన కుటుంబానికి మినహాయింపు ఉండేది. 1989 నాటికే లక్ష్మీ పార్వతి ఎంటర్ అవ్వడం.. ఆయన మానసికంగా ఒత్తిడిలో ఉండడంతో పాలన పట్టుతప్పింది. కుటుంబం కూడా దూరమయింది.. అలా ఆయన విఫలమయ్యారు. కుటుంబ పెద్దగా.., పాలకుడిగా విఫలమయ్యారు. అన్నిటిలో చురుకుగా ఉండే ఎన్టీఆర్.. పాలనలో తన చుట్టూ జరుగుతున్నా తంతుని తెలుసుకోలేకపోయారు. 1989 నాటి ఓటమి ఎన్టీఆర్ ని మానసికంగా చాలా కుంగదీసింది. కానీ.. 1989లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీవ్రస్థాయిలో అవినీతి, పాపకార్యాలు చేయడంతో 1994లో మరోసారి టీడీపీ పగ్గాలు చేపట్టింది. కానీ ఈ ఎన్నికలను పూర్తిగా చంద్రబాబు నడిపించారు. ఎన్టీఆర్ ని ముందు పెట్టి చంద్రబాబు తెరవెనుక పోల్ మేనేజ్మెంట్ చూపించారు. డబ్బు, మందు ఎన్నికల్లో ఇస్తారు అనే ఒక కొత్త సంప్రదాయానికి ఈ ఎన్నికల ద్వారానే తెరతీశారు. ఈ ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఏడాదిలోనే ఎన్టీఆర్ మళ్ళి కుటుంబం చేతిలో తన బలహీనతల చేతిలో ఓడిపోయారు..! అందుకే ఎన్టీఆర్ రాజకీయంగా ఏమంత గొప్ప కాదు. మనకు చరిత్రలో మిగిలిన వైఎస్సార్ లాగానే, ఎన్టీఆర్ కూడా ఒక మంచి పాలకుడు. ఒక మంచి సీఎం అంతే..!


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

18 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

1 hour ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

3 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

4 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

4 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago