26.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

NTR: ఎన్టీఆర్ సీఎం అంటూ దద్దరిల్లిన ప్రాంగణం..!!

Share

NTR: స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో నందమూరి అభిమానులు టిడిపి పార్టీ క్యాడర్ ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో “మహానాడు” జరుగుతున్న సంగతి తెలిసిందే. “మహానాడు” కార్యక్రమంలో ఎలాగైనా ఈసారి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటూ టీడీపీ నాయకులు తెగ ప్రసంగాలు చేస్తున్నారు.

NTR CM big slogans in at ntr ghat

పరిస్థితి ఇలా ఉంటే ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉదయం నందమూరి కళ్యాణ్ రామ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి రావటం జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రాంగణం మొత్తం ఎన్టీఆర్ సీఎం.. అనే నినాదాలతో మారుమోగింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉన్న చాలా మంది అభిమానులు “ఎన్టీఆర్ సీఎం.. ఎన్టీఆర్ సీఎం” అంటూ పెద్ద పెద్ద నినాదాలతో.. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ నివాళులు అర్పిస్తూ ఉండగా గట్టి గట్టి అరుపులతో.. కార్యకర్తలు.. అభిమానులు అరిచారు.

ఇప్పుడే కాదు చంద్రబాబు పర్యటనలో ఇంకా చాలా సందర్భాలలో ఎన్టీఆర్ సీఎం అనే నినాదాలు మారు మ్రోగుతూనే ఉన్నాయి. ఏపీలో టీడీపీ నాయకులూ చాలామంది ఎన్టీఆర్ నీ పార్టీలోకి మళ్లీ తీసుకురావాలని.. యాక్టివ్ చేయాలని కోరుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఒక పక్క మహానాడు జరుగుతూ ఉండగా మరో పక్క ఎన్టీఆర్ ఘాట్ వద్ద… ఎన్టీఆర్ సీఎం.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయటం టీడీపీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.


Share

Related posts

జగన్ ఏడాది పరిపాలన జస్ట్ ట్రైలర్ మాత్రమే అంటున్న వైసీపీ నేత..!!

sekhar

డయాబెటిస్ ఉన్నవారు యాపిల్స్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Teja

దీపావళి రోజు ఆ పని చేశారంటే రూ.లక్ష ఫైన్! మీ ఇష్టం మరి!

Teja