NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Congress G23: మొన్న టీడీపీ.. నేడు కాంగ్రెస్..! చుక్కలు చూపిస్తోన్న ‘ఆ’ సంఖ్య..!

Congress G23: మొన్న టీడీపీ.. నేడు కాంగ్రెస్..! చుక్కలు చూపిస్తోన్న 'ఆ' సంఖ్య..!

Congress G23: కాంగ్రెస్ G23..Congress G23  2019లో టీడీపీకి చుక్కలు చూపించిన 23 సంఖ్య ఇప్పుడు కాంగ్రెస్ కు కూడా చూపిస్తోంది. కాంగ్రెస్ జీ23 ప్రస్తుతం గాంధీ కుటుంబాన్ని కలచివేస్తోంది. అసలే దేశవ్యాప్తంగా కుదేలైన కాంగ్రెస్ కు ఇప్పుడు జీ23 గా పిలవబడే సీనియర్లు కాంగ్రెస్ పై దాదాపు తిరుగుబాటు ధోరణి కనబరుస్తున్నారు. ఇటివల రాజ్యసభ ఎంపీగా గులాంనబీ ఆజాద్ ను కొనసాగించకుండా కాంగ్రెస్ చేసిన పని ఇప్పుడు అధిష్టానానికి చుట్టుకుంటోంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ప్రచారాన్ని తమ భుజాలపై వేసుకున్న రాహుల్ – ప్రియాంకలకు ఇది మింగుడుపడని అంశం. అందుకే వారి ప్రచారంలో జీ-23 అంశాన్ని ప్రస్తావించడం లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై పదునైన విమర్శలు, వాగ్భాణాలు సంధిస్తున్నారు.

number irritating then tdp now congress
number irritating then tdp now congress

గులాంనబీ ఆజాద్ రాజ్యసభ ఎంపీగా పదవీకాలం ముగిసిన రోజున ప్రధాని మోదీ ఆయన్ను పొగడటం చర్చనీయాంశంగా మారింది. ఆజాద్ కూడా మోదీతో తనకు ఎప్పటినుంచో స్నేహం అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ వర్గాలను విస్మయపరచాయి. కాంగ్రెస్ ముసుగులో బీజేపీకి మద్దతిస్తున్నారా..? అనే వ్యాఖ్యలూ వచ్చాయి. ఇటివల జమ్మూలో జరిగిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అనే ప్రభుత్వేతర సంస్థ శాంతి సమ్మేళన్ లో కపిల్ సిబల్ సైతం కాంగ్రెస్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అజాద్ పై కాంగ్రెస్ నిర్ణయం సరికాదనే వాదనా వచ్చింది. ఇప్పటినుంచి మేల్కొనకపోతే వచ్చే 2024 పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధపడదనేది వారి ఉద్దేశం.

ఇవన్నీ నిశితంగా పరిశీలిస్తున్న సోనియాగాంధీ సైతం మిన్నకుండిపోతున్నారు. కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాహుల్ కే పట్టం కట్టాలని భావిస్తున్న తరుణంలో పార్టీ సీనియర్లు 23 మంది నుంచి వ్యతిరేకత వస్తోంది. వీరి మాటల్లో కాంగ్రెస్ అధినాయకత్వం రాహుల్ కు ఇవ్వడం వారికి ఇష్టం లేదనే అర్ధమే వస్తోంది. సోనియా వయోభారం, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో పార్టీని బతికించాలని సోనియా, రాహుల్, ప్రియాంక ఓవైపు.. పార్టీ సీనియర్లు ఓవైపు తాపత్రయపడుతున్నారు. సోనియా కుటుంబం మాత్రం జీ-23 నేతలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఏ తీరం దాటుతుందో చూడాల్సి ఉంది.

 

 

 

 

author avatar
Muraliak

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?