NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ గట్టునుంటావా ఓ చంద్రబాబు .. ఈ గట్టు కొస్తావా !!

దేశ రాజకీయాల్లోనే సీనియర్ నాయకులలో ఒకరు చంద్రబాబు. జాతీయ రాజకీయాల్లో ఒకానొక సమయంలో ఎన్డీఏ లో చక్రం తిప్పిన నేతగా చంద్రబాబు కి పేరు ఉంది. అటువంటి చంద్రబాబు పరిస్థితి ప్రస్తుతం ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారిపోయింది. కారణం 2019 ఎన్నికల ఫలితాలు. అంతకుముందు పది సంవత్సరాలు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు విభజన జరిగిన తర్వాత మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. దీంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చాలావరకూ ఎన్నికల హామీలను గాలికొదిలేసిన్నట్లు వ్యవహరించడంతో, స్పెషల్ స్టేటస్ విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గడంతో మరోపక్క జగన్ పుంజుకోవడంతో చంద్రబాబు 2019లో ఓటమి పాలవడం జరిగింది.

TDP chief Chandrababu Naidu announces new parliament presidents in Andhra  Pradesh - India Newsఇదిలా ఉండగా గత సార్వత్రిక ఎన్నికల టైంలో బీజేపీ ని దూరం చేసుకుని మోడీ పర్సనల్ లైఫ్ పై భయంకరమైన విమర్శలు చంద్రబాబు చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత పరిస్థితి చూస్తే కేంద్రంలో మోడీ బలమైన ప్రభుత్వం స్థాపించి ఉండటంతో పాటు ఇటు రాష్ట్రంలో జగన్ తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వం స్థాపించడం…ఇప్పుడు చంద్రబాబుకి పార్టీని ముందుకు నడిపించడానికి ఏం చేయలేని పరిస్థితి అయినట్టు నెలకొంది. దీంతో చంద్రబాబుకి చెక్ పెట్టాలంటే ఇదే సమయమని భావిస్తున్న జగన్ రాజధాని అమరావతి భూములు విషయం ఇంకా కొన్ని విషయాలకి సంబంధించి అవినీతి జరిగింది అంటూ సిబిఐ ఎంక్వైరీకి రెడీ అవుతున్నారు.

 

ఈ తరుణంలో పార్టీని ముందుకు నడిపించాలంటే కచ్చితంగా కేంద్రం సపోర్ట్ ఉండాల్సిందే అన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అనేక సార్లు ప్రయత్నాలు చేసినట్లు ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబు గురించి కామెంట్లు చేస్తున్నారు. జగన్ ని కంట్రోల్ చేయాలంటే మోడీ ఆశీస్సులు ఉండాల్సిందే అన్న భావనలో చంద్రబాబు ఉన్నారట. పరిస్థితి ఇలా ఉండగా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి కామ్రేడ్లు ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పై కొద్దికొద్దిగా వ్యతిరేకత వస్తున్న తరుణంలో మోడీ వ్యతిరేక విధానాల మీద పోరాడటానికి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి  కమ్యూనిస్టు పార్టీలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో మోడీ ని ఎదిరించే సత్తా చంద్రబాబు లో ఉందా అన్న వార్తలు ఇప్పుడు వినబడుతున్నాయి. ఏదిఏమైనా ఏపీలో చంద్రబాబు రాజకీయ చిత్రం గమనిస్తే ఆ గట్టునుంటావా ఈ గట్టుకు వస్తావా అన్న చందంగా మారినట్లు పరిశీలకుల మాట.

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N