కూటమికీ, బిజెపికీ దూరం: నవీన్‌ పట్నాయక్

ఢిల్లీ, జనవరి9: విపక్ష పార్టీలతో కూడిన మహాకూటమిలో చేరేప్రసక్తే లేదని బిజెడి నేత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తేల్చిచెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు బిజెడి సమదూరం పాటిస్తుందని స్పష్టం చేశారు.
ధాన్యానికి మద్దతు ధరను క్వింటాల్‌కు 2930 రూపాయలు పెంచాలన్న డిమాండ్ ‌తో దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం మద్దతు ధరపై స్పందించడంలేదంటూ ఆయన విమర్శించారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెడి ఏ కూటమిలో చేరుతుందన్న ఊహాగానాలకు నవీన్ పట్నాయక్ తెరదించారు.