NewsOrbit
రాజ‌కీయాలు

ఒకే వేదికపై బద్ధశత్రువులు

మైన్ పురి: ములాయం సింగ్ యాదవ్ – మాయావతి.. యూపీ రాజకీయాల్లో ఇద్దరూ పాతికేళ్ల నుంచి బద్ధ శత్రువులు. అలాంటివాళ్లు ఇప్పుడు ఒకే వేదికపైకి వస్తున్నారు. అత్తా అల్లుళ్ల పొత్తు (మాయ-అఖిలేశ్) సత్ఫలితాలు ఇవ్వడంతో సార్వత్రిక ఎన్నికలలో సమాజ్ వాదీ, బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీని ఓడించేందుకు చేతులు కలిపాయి. దాంతో సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి మైన్ పురి నగరంలో నిర్వహించే ప్రచారసభలో ఒకే వేదికపై కలిసి పాల్గొంటున్నారు. పాతికేళ్లుగా ఉన్న శత్రుత్వాన్ని పక్కన పెట్టి మరీ వారు చేతులు కలుపుతున్నారు. ఇందుకోసం క్రిస్టియన్ ఫీల్డ్ పూర్తిస్థాయిలో ముస్తాబైంది.

1995లో రెండు పార్టీల మధ్య పొత్తు కాస్తా చిత్తవడంతో అప్పటినుంచి ములాయం, మాయావతి కనీసం ఒకరినొకరు చూసుకోడానికి, పలకరించుకోడానికి కూడా ఇష్టపడలేదు. స్టేట్ గెస్ట్ హౌస్ లో మాయావతి ఉన్నప్పుడు, అక్కడకొచ్చిన ఎస్పీ కార్యకర్తలను బీఎస్పీ కార్యకర్తలు కొట్టడంతో వివాదం మొదలైంది. దాంతో ములాయం మాయావతి సర్కారుకు మద్దతు ఉపసంహరించుకుని బీజేపీతో చేతులు కలిపారు. అప్పటి నుంచి ఉన్న విభేదాన్ని ఒక్కసారిగా తప్పించడం ములాయంకు అంత సులభం కాలేదు. దాంతో అనారోగ్యం వంకతో దేవ్ బంద్, బదయూ, ఆగ్రా ర్యాలీలకు ఆయన డుమ్మాకొట్టారు.

కానీ పార్టీ అధ్యక్షుడు, తన కొడుకు అఖిలేశ్ పట్టుబట్టడంతో మాయావతితో వేదిక పంచుకోడానికి అంగీకరించారు. ఈ సభలో రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ కూడా పాల్గొంటున్నారు. సభకు వచ్చే 35 వేల మందికి పైగా ప్రజలకు ఆహార పొట్లాలు కూడా అందిస్తున్నామని, ములాయం మధ్యాహ్నానికి వస్తారని పార్టీ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తు మూడునాళ్ల ముచ్చటేనని బీజేపీ విమర్శిస్తుండగా.. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని మాయావతి, అఖిలేశ్ తమ కార్యకర్తలకు చెబుతున్నారు.

Related posts

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

Leave a Comment