NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

మోదీ కొత్త రకం ప్రచారం

(ఫొటో ఎన్‌డిటివి సౌజన్యంతో )

ఢిల్లీ, జనవరి 25: సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోది చేపట్టిన ఉత్తరాల కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున తరుణంలో మోదీ  ‘ఆయుష్మాన్ భారత్’ పథకం గురించి  అవగాహన పేరుతో తన ఫొటోతో కూడిన లేఖలను ఆ ఫధకం లబ్దిదారులకు నేరుగా పంపాలని నిర్ణయించారు.

ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం ప్రవేశపెట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా 7.5 కోట్ల మంది ప్రజలకు మోదీ లేఖలను అందజేయనున్నారు. ‘నేను నా జీవితంలో పేదరికాన్ని చాలా దగ్గర నుంచి అనుభవించాను. అందుకే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, మహిళలకు సాధికారత కల్పించడం లక్ష్యంగా రకరకాల పధకాలు ప్రవేశపెట్టాను’ అంటూ మోదీ ఆ లేఖలో పేర్కొంటారు.

ఈ లేఖల కోసం కేంద్రం సుమారు 15.75 కోట్ల రూపాయలను వ్యయం చేయనుంది. ఆయుష్మాన్‌భారత్ నిధులు కాకుండా పాలనాపరమైన నిధులకో ఈ లేఖల కార్యక్రమం చేపడుతున్నట్లు పధకం సిఇఓ ఇందు భూషణ్ చెప్పారని ఎన్‌డి టివి తెలిపింది.

సార్వత్రితక ఎన్నికల నేపధ్యంలో ప్రధాని ఉత్తరాలతో ప్రచారానికి  శ్రీకారం చుట్టారని ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ఇది ఎన్నికల ప్రచారం తప్ప మరోటి కాదని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ లేఖల కారణంగానే ఆయుష్మాన్‌బారత్ పధకం నుంచి తప్పుకున్నారు. ఏ రాష్ట్రానికి ఆ స్థానిక భాషలో ముద్రించిన ఈ లేఖలలో ఎన్‌డిఎ ప్రభుత్వం చేపట్టిన ఇతర పధకాల గురించి కూడా వివరించారు.

ఈ పథకం క్రింద ప్రజలకు ఏ విధంగా ఆరోగ్య సేవలు లభించనున్నాయో వివరిస్తూ ప్రధాని రెండు పేజీల ఉత్తరాన్ని ప్రజలకు రాశారు. తొలి పేజీలో పిఎంజెఎవై గురించి ప్రస్తావించగా రెండవ పేజీలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన ఎనిమిది రకాల  పథకాల గురించి ప్రధాని వివరించారు. పచ్చ తెలుపు రంగు ఎన్వలప్ కవర్‌పై మోదీ ఫొటో ముద్రించిన కవర్‌ను పోస్టల్ శాఖద్వారా బట్వాడా చేయనున్నారు.

ఇప్పటికే కేరళ రాష్ట్రానికి  12లక్షల ఉత్తరాలు తొలివిడతగా చేరుకున్నాయి. రెండు లక్షల లెటర్స్ ఇప్పటికే ప్రజలకు చేరాయి.    ఎన్నికల జిమ్మిక్కులో భాగంగా ప్రధాని ఉత్తరాల కార్యక్రమంతో తన స్వంత ప్రచారాన్ని చేపట్టారని పాలక్కాడ్ పార్లమెంట్ సభ్యులు రాజేష్ ఆరోపించారు.

 

 

 

author avatar
Siva Prasad

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Leave a Comment