NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Delhi Riots : రైతులకు విపక్షాల మద్దతు..! తాత్కాలికమా..!? రాజకీయమా..!?

Delhi Riots.. రైతుల సమస్యలపై విపక్షాలు గొంతు పెంచుతున్నాయి. వారికి మద్దతు ఇస్తున్నాయి. అయితే.. ఇది తాత్కాలికమా..? రాజకీయ కోణమా..? అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నా ఇప్పుడు దేశ సమస్య కాదు. అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. పాప్ సింగర్ రిహన్నా చేసిన ఒకే ఒక్క ట్వీట్ భారత్ ను కుదిపేస్తోంది. ప్రపంచాన్ని కదిలించేలా చేసింది. భారత జాతి సమగ్రత కోసం మాట్లాడుతున్న ఎందరో సెలబ్రిటీలు కూడా ప్రపంచం స్పందించే వరకూ మాట్లాడని వాళ్లే. దేశంలో ఇంతటి సమస్య ఎందుకు ఉత్పన్నమైందని.. చర్యలు తీసుకోవాలని సెలబ్రిటీలు మాట్లాడటం లేదు. మా దేశ విషయంలో మీ జోక్యం అనడం విచిత్రమైన విషయం. ఢిల్లీలో ధర్నాలు కాదు.. గణతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోటపై జరిగిన సంఘటన భారత్ సమస్య యావత్ ప్రపంచాన్ని కదిలించింది.

opposition parties fight for farmers: Delhi Riots
opposition parties fight for farmers :Delhi Riots

Delhi Riots ప్రపంచమే స్పందించేలా..

రెండు నెలలకు పైగా జరుగుతున్న రైతుల ఆందోళనలు ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ఇన్నాళ్లూ రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాత్రమే జరిగిన యుద్ధం ఇప్పుడు భారత్ అంతా పాకింది. యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. అదీ గొప్పగా కాదు.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ ఉప్పెన్ ఏంటీ.. ఏం చేస్తారు అనే. పర్యావరణ పరిరక్షకురాలు గ్రెటా థన్ బర్గ్ కూడా ఇదే విషయమై స్పందించింది. ఆమె చేసిన ట్వీట్ ఇచ్చిన లింక్ ప్రకంపనలు రేపింది. ఇది ఖలిస్తాన్ కుట్ర అని ఇండియన్ పోలీసులు తేల్చారు. అయినా.. ఆమె వెనక్కు తగ్గేది లేదు అంటోంది. అమెరికా కూడా భారత్ తో చర్చలు జరపాలని చూస్తోంది. ఇలా మొత్తం ప్రపంచం ఇటు చూడటంతో భారత్ పరువు కోసం పాకులాడాల్సిన పరిస్థితి. రైతులు ఘాజీపూర్ రాకుండా దారిలో మేకులు కొట్టడం, బారికేడ్లు పెట్టడం భారత్ పరువు తీసింది. మరోవైపు రాజ్యసభలో విపక్షాలు కూడా కేంద్రంపై తీవ్ర  విమర్శలు చేస్తోంది. ఇది తమ నిరంకుశవాదానికి కేంద్రం స్వయంగా చెల్లించుకుంటున్న మూల్యం.

 

రైతుల పక్షాన విపక్షాలు..

దిగ్విజయ్ సింగ్ (కాంగ్రెస్).. మూడు వ్యవసాయ చట్టాల్లో ఒకదానిని ఆరెస్సెస్ వ్యతిరేకిస్తోంది. ప్రజల మనోభావాల్ని విప్లవంగా భావిస్తున్నారా.?

దేవెగౌడ (జేడీఎస్).. రిపబ్లిక్ డే రోజున జరిగిన ఘటనలో సంఘవ్యతిరేక శక్తులు ఉన్నాయి. దీనిని రైతులకు ఆపాదించకూడదు.

మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ).. ప్రభుత్వం మద్దతు ధరకు పంటను కొనడం 2006లోనే బీహార్ మానేసింది. దీంతో అక్కడ రైతులు లేరు. దేశానికి కాంట్రాక్టు కార్మికుల సరఫరా రాష్ట్రంగా మిగిలిపోయింది. పంజాబ్, హరియాణాలను కూడా అలానే మార్చేలా ఉంది కేంద్రం.

బికాస్ రంజన్ భట్టాచార్య (సీపీఎం).. రోడ్లపై మేకులు కొట్టి, బారికేడ్లు పెట్టి రైతులను ఎలా చర్చలకు ఆహ్వానిస్తారు. ప్రజసామ్య వ్యవస్థలో ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇది కాదు.

శ్రేయాస్ కుమార్ (లోక్ తాంత్రిక్ జనతాదళ్).. ఎర్రకోటపై అవమానం జరిగిందని బీజేపీ అంటోంది. కానీ.. అదే ఎర్రకోట నిర్వహణను అయిదేళ్ల కాలానికి ఓ ప్రైవేటు సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి వాణిజ్య కేంద్రంలా మార్చారు కదా. ప్రభుత్వం ఇష్టారాజ్య తీరుకు ఇది నిదర్శనం.

కేంద్రం స్వయంకృతాపరాధమేనా..?

దేశానికి అన్నం పెట్టే రైతుని రోడ్లపాలు చేసిన అపఖ్యాతి మోదీ ప్రభుత్వానికి స్వయంకృతాపరాధంలా తగిలింది. తాత్కాలికంగా ఏడాదిపాటు వ్యవసాయ చట్టాలు అమలు చేయం అంటోందే కానీ.. రైతుల ఒత్తిడికి తలొగ్గి కేంద్రం వెనక్కు తగ్గటం లేదు. మొన్నటి వరకూ రెండు రాష్ట్రాలకు కేంద్రానికి సంబంధించిన సమస్యపై ఇప్పుడు జాతి స్పందిస్తోంది. సెలబ్రిటీల వ్యాఖ్యలతో ప్రజల్లో చైతన్యం వస్తోంది. మరోవైపు ప్రభుత్వంపై దాడి కాకుండా ఒత్తిడి పెంచుతున్నాయి విపక్షాలు. ఈ విషయంలో ప్రపంచంలో స్పందిస్తోందంటే దేశ సమైగ్రతకు దెబ్బ. బీజేపీ ప్రభుత్వాన్ని మరింత ఆందోళనకు గురి చేసే అంశం ఇది. అసలే బీజేపీ నిరంకుశత్వంపై అవకాశం కోసం కాచుకుని కూర్చున్న విపక్షాలు రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. దీంతో అంశం ఇప్పుడు దేశవ్యాప్తమవుతోంది. మరోవైపు.. మీరు అధికారంలో ఉండగా రైతుల కోసం ఏం చేశారు అని బేజేపీ ప్రశ్నించడం తప్ప పరిస్థితిని అదుపులోకి తేవడం లేదు. దీంతో విపక్షాలు రైతులకు సంఘీభావంగా మరింత పట్టుదలతో పోరాడుతున్నాయి. ఇంత సంచలనం రేపిన విషయంలో విపక్షాలు తమ స్వలాభం చూసుకోకుండా జాతి కోసం ఐక్యపోరాటం చేస్తే రైతులను కాపాడినట్టే.. జాతిని కాపాడినట్టే

author avatar
Muraliak

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?