(ఫైల్ ఫోటో)
రాజమండ్రి:. మిత్రుడు అలీ చెప్పిన వాళ్లకు టిక్కెట్ ఇచ్చినా తనను వదిలి వెళ్లాడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
ఆలీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని పవన్ చెప్పారు. తనతో కలిసి పనిచేస్తానన్న అలీ చెప్పకుండా వైసిపిలోకి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అలీ లాంటి వాళ్ల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని పవన్ అన్నారు.
తాను ఎన్నికల్లో రాణించలేనని ఆయన ఎలా అనుకుంటారని పవన్ ప్రశ్నించారు. ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’ సినిమాతో స్టార్ అవుతానని ఎవరైనా అనుకున్నారా’ అని పవన్ ప్రశ్నించారు.
అలీ సిఫార్సు చేసిన వ్యక్తికి ఎంపి సీటు ఇస్తే ఆ నియోజకవర్గంలో ఆలీ వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేయడం ఎంత వరకు భావ్యమన్నారు.
తాను ఆదుకున్న అలీ లాంటి వాడే వదిలేసి వెళితే ఇంకా ఎవరిని నమ్మాలని పవన్ ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లను చూసిన తరువాత ప్రజలను తప్ప బంధుమిత్రులను కూడా నమ్మడం లేదని పవన్ అన్నారు.