NewsOrbit
రాజ‌కీయాలు

పవన్ అలా.. బీజేపీ ఇలా..! ఢిల్లీ టూర్ ఆంతర్యం అదేనా..?

pawan kalyan delhi tour importance

పవన్ కల్యాణ్ పవర్ స్టార్ గా సినిమాల్లో ఏం చేసినా ఫ్యాన్స్ ఊగిపోతారు.. ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ.. అదే స్ట్రాటజీ పాలిటిక్స్ లో వర్కౌట్ కాదు. ఈ విషయం పవన్ కు తెలియంది కాదు.. కొత్తగా చెప్పేదీ కాదు. కానీ.. కుహనా రాజకీయాలకు జనసేన అతీతం అని జనసేనాని చెప్తూనే ఉంటారు. అయితే.. చేతల్లో సమకాలీన రాజకీయాలకు, పరిస్థితులకు జనసేన తలొగ్గిందా..? అనే అనుమానాలు లేకపోలేదు. ఇటివలి పవన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన చూస్తే అదే అనిపిస్తుంది. ‘లీడర్’ సినిమాలో కోట శ్రీనివాసరావుతో ఆహుతి ప్రసాద్ భేటీ అయ్యి రాజకీయాంశాలు మాట్లాడి.. బయటకొచ్చి మీడియాతో కేవలం ఫ్రెండ్లీ సమావేశం అంటాడు. జనసేనాని ఢిల్లీ పర్యటన.. ప్రకటనలు ఇలానే అనిపిస్తున్నాయిన చెప్పాలి.

pawan kalyan delhi tour importance
pawan kalyan delhi tour importance

బీజేపీ చెప్పిందే పవన్ చెప్పారా..?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశంలో ‘తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థిపై చర్చించాం.. జనసేన అభ్యర్థా.. బీజేపీ అభ్యర్థా అనే విషయంపై కమిటీ నిర్ణయిస్తుంది.. అమరావతిలో రైతులకు న్యాయం జరిగేవరకు జనసేన అండగా ఉంటుంది.. ఏపీలో ఆలయాలపై దాడులపై కూడా చర్చించాం.. పోలవరంపై ఖర్చంత కేంద్రమే భరించాలని అని చెప్పాం..’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. ‘ఉప ఎన్నిక కోసం ఈ పర్యటన జరగలేదు.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం.. రాజధాని అమరావతి, పోలవరం అంశాలు చర్చించాం.. అమరావతే రాజధానిగా ఉండాలనేదే జనసేన నిర్ణయం..’ నాదెండ్ల మనోహర్ అంటున్నారు. నిజానికి బీజేపీ కూడా ఇవే మాటలను చెప్తోంది. ఢిల్లీ వెళ్లి జనసేన తేల్చింది ఇదా.. అనే వాఖ్యాలు వినిపిస్తున్నాయి.

పవన్ ఆంతర్యం ఇదేనా..?

జీహెచ్ఎంసీలో నామినేషన్లు వేసాక తప్పుకోవడం.. కొన్ని సీట్లైనా అడగలేకపోవడం.. మొత్తంగా తప్పుకోవడంపై విమర్శలు వచ్చాయి. మరోవైపు తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తమ అభ్యర్ధిని నిలబెడతాం అని ఎప్పటినుంచో చెప్తోంది. దీంతో.. తమకు అవకాశం ఇవ్వాలని కోరేందుకే జనసేనాని ఢిల్లీ వెళ్లారని కూడా అంటున్నారు. జీహెచ్ఎంసీ నేపథ్యంలో విమర్శలు తట్టుకోలేక.. ఏపీలో క్యాడర్ కు నమ్మకం కలిగించేందుకు.. తిరుపతి సీటు దక్కించుకునేందుకే ఈ పర్యటన అనే వాదనలూ లేకపోలేదు. కానీ.. అక్కడ ఉన్నది బీజేపీ.. అంత తేలిగ్గా ఒప్పుకుంటుందా..? అందుకే కమిటీ అంటూ ముందుకొచ్చారు. పనిలో పనిగా పోలవరం, అమరావతి అంటూ రాగాలు తీసారని అంటున్నారు. లోగుట్టు పెరుమాళ్ల కెరుక..!

author avatar
Muraliak

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk